తెలంగాణను వణికిస్తున్న నిజాముద్దీన్, Govt serious on Nizamuddin
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విలయాన్ని సృష్టిస్తున్న కరోనా మహమ్మారికి భారత దేశంలో ఒక్కసారిగా కలకలాన్ని రేపింది. Govt serious on Nizamuddin విదేశాల నుంచి తిరిగొచ్చినవారికి , వారితో సన్నిహితంగా మెలిగినవారికి మాత్రమే కరోనా వైరస్ సోకగా , ఇప్పుడు కొత్తగా వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసులకు కేంద్ర బిందువుగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం మారింది .
ఒక్కసారిగా పాలకుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది . ఇందుక్కారణం కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగిన భారీ అంతర్జాతీయ మత ప్రచార కార్యక్రమమే .
నిజాముద్దీన్ మర్కజ్ అంశం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది . రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి ఆచూకి తెలుసుకునేందుకు ప్రభుత్వం నాలుగు బృందాలను రంగంలోకి దింపింది . రెవెన్యూ , జీహెచ్ఎంసీ , వైద్యారోగ్యశాఖతోపాటు పోలీసు ఉన్నతాధి కారులను ఈ బృందంలో నియమించి జల్లెడ పట్టిస్తోంది .
ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి 1030 మంది నిజాముద్దీన్లో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొనేందుకు వెళ్లారు . అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు .
మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే కొంత మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 15మందికి కరోనా పాజిటివ్ గా తేలింది . మిగతావారిని పట్టుకుని వారికి కూడా వైద్య పరీక్షలు జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోంది .
జమిత్ ప్రార్థనల వ్యవహారాన్ని Govt serious on Nizamuddin ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది . ఈ అంశంపై సీఎం కేసీఆర్ అనుక్షణం సమీక్షిస్తూ వివరాలను తెప్పించుకుని సంబంధిత అధికారులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.
నిజాముద్దీన్ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమయింది . కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ పూర్తిగా చేయి దాటకుండా చర్యలకు ఉపక్రమించింది . ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది .
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌనన్ను మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది . ఈ మేరకు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం . అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి కాలక్షేపం చేస్తున్నవారిని గుర్తించడంతోపాటు వారిని పూర్తిస్థాయిలో నిరోధించాలని కోరినట్లు సమాచారం .
ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల ఎస్సీలకు , పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది . ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షించగా అందులో 15 మందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 97కు చేరింది . విదేశాల నుంచి కరోనాను తీసుకు వచ్చిన వారికంటే ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారానే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు .
మరో రెండు , మూడు రోజు ల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు . మర్కజ్ ప్రార్థనలకు తెలంగాణ నుంచి వెళ్లినవారి జాబితాను అధికారులు గుర్తించి వారి కోసం వెతుకతున్నారు.
7 Comments