కరీంనగర్ లో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు, 2 corona +ve cases in Karimnagar
కరీంనగర్‌కు ఇటీవల వచ్చి కరోనా వైరస్ సోకిన ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన 2 corona +ve cases in Karimnagar స్థానికుడికి కరోనా సోకగా అతడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే . తాజాగా సదరు వ్యక్తి తల్లి , సోదరికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు .
ఈ. విషయాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం రాత్రి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు . కరోనా సోకినవారి కుటుంబంలో ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు .
ఆ కుటుంబంలోని ముగ్గురు పిల్లలను కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని చెప్పారు . 2 corona +ve cases in Karimnagar కరీంనగర్‌లో మొత్తం 62 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని ఆయన తెలిపారు . నిజామాబాద్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి స్నేహితుడిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రానికి తరలించగా అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందాడు . సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే క్రమంలో అతనికి గుండెపోటు వచ్చి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఆ సందర్భంగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది . నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ రాగా అతని కుటుంబ సభ్యులు , బంధువులు , స్నేహితులను ఐసోలేషను తరలించారు . హైదరాబాద్లోని బర్కత్పుర ప్రాంతానికి చెందిన వ్యక్తిని కూడా సదరు పాజిటివ్ వచ్చిన వ్యక్తి కలవడంతో ఆయనను తీసుకువచ్చి నిజామాబాద్ ఐసోలేషన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు .
ఆదివారం అర్ధరాత్రి ఆయన మరణించాడు . ఆగ్రహించిన బందువులు వైద్య సిబ్బందిపై దాడి చేశారు . పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు . దక్షిణాఫ్రికా నుండి షాద్నగర్ వచ్చిన ఓ వ్యక్తి రహస్యంగా ఇంట్లోనే ఉండడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు .
దక్షిణాఫ్రికా నుండి నేరుగా ముంబై విమానాశ్రయానికి చేరుకుని , అక్కడి నుంచి షాద్నగర్ పట్టణానికి ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కూడా వచ్చి స్థానికంగా తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది . ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హెల్త్ ర్యాపిడ్ యాక్షన్ టీం బృందానికి సమాచారం అందించారు . విదేశాల నుంచి వచ్చి ఎవరికీ చెప్పకుండా తలదాచుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి .
ఒంగోలుకు చెందిన తన్నీరు శ్రీనివాస్ దక్షిణాఫ్రికా నుంచి ఈ నెల 21న వచ్చినట్లు గుర్తించారు . అయితే స్థానిక అధికారులకు సదరు వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు . షాద్నగర్‌లోని తన బందువుల వద్ద నివాసముంటున్న శ్రీనివాసు వైద్యారోగ్య సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది . ఇలా చెప్పాపెట్టకుండా విదేశాల నుంచి వచ్చి బయట తిరగడంపై స్థానికులు మండిపడుతున్నారు . శ్రీనివాస్ పాసుపోర్టును అధికారులు సీజ్ చేసి ఆయన ఇంటికి సిక్కర్ అంటించారు .
2 Comments