తెలంగాణలో ఒకే రోజు 66 కొత్త కరోనా కేసులు, Total coronavirus cases in TS
తెలంగాణ రాష్ట్రంలో అతివేగంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా మహమ్మారి వ్యాపిస్తోందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. Total coronavirus cases in TS 766 కరోనా వ్యాప్తి చెందుతోందన్న ఆందోళన వాస్తవరూపం దాల్చడం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది .
ఇప్పటివరకు నమోదైన Total coronavirus cases in TS 766 కేసుల్లో 18శాతానికి పైగా 11 కుటుంబాల్లోనే వైరస్ వ్యాపించినట్లు అధికారవర్గాలు లెక్కలు తేల్చాయి . ఈ 11 మందితోనే దాదాపు 125 మందికి వైరస్ సోకగా ఒకే కుటుంబంలో 20మంది కరోనా బారిన పడ్డారు.
ఈ కేసులన్నీ మర్కజ్ నుండి వచ్చిన కుటుంబాలే కావడంతో వైద్య , ఆరోగ్యశాఖ ఉరుకులు , పరుగులు పెడుతోంది . వీరిలో 6 నెలల పసికందు నుంచి పదేళ్లలోపు చిన్నారులు ఉండడం కలవరానికి గురిచేస్తోంది.
రోజూ 5 వేల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది . శనివారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు వైద్య , ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది . రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తుండడం , శుక్రవారం ఒక్కరోజే 66మందికి వైరస్ సోకడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారిలో 19మంది మృతిచెందారు . రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా విస్తరించింది . ఇప్పటి వరకు గ్రీన్ జోన్‌గా ఉన్న మంచిర్యాలలో తొలి కరోనా కేసు నమోదైంది.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన మహిళ ( 48 ) కు కరోనా లక్షణాలు ఉండడంతో ఆమెను ఈ నెల 14న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు . అదే రోజు ఆమె ఆసుపత్రిలో మరణించారు .
చనిపోయాక ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది . జిల్లాలో తొలికేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు, ముత్తరావుపల్లిలో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ మరణంతో రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 19కి చేరింది . కరోనా సోకి చికిత్స పొందుతున్న నలుగురి పరిసితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది . వీరంతా గాంధీ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు చెబుతున్నారు.
3 Comments