ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు శుభవార్త… ప్రభుత్వ రుణాలు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆశయంగా రూపొందించిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతో మందికి ఆశాజ్యోతి లాంటి కార్యక్రమం. ఇప్పటికే ప్రభుత్వంవారు అర్హత కలిగిన వారికి ప్రొసీడింగ్ లెటర్ మంజూరు చేశారు. అయితే, అసలు ఇబ్బంది ఇక్కడే మొదలవుతుంది – ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన ప్రారంభ నిధులు లేకపోవడం. తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం శక్తి వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుల ఆర్థిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని, గృహ నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం మొత్తం రూ.5 లక్షలు నాలుగు విడతలుగా మంజూరు చేస్తుంది. మొదటి విడతలో రూ.1 లక్ష లభిస్తుంది. అయితే, ఈ మొదటి విడత పొందాలంటే ఇంటి పునాది (foundation) తీసుకొని దాని ఫోటోను ఇందిరమ్మ యాప్ లో అప్‌లోడ్ చేయాలి. ఆ ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాతే నగదు వారి ఖాతాలో జమ అవుతుంది.
అయితే, పునాది నిర్మాణానికి కూడా అనేక ఖర్చులు ఉంటాయి. మేస్త్రీల వేతనాలు, రాయి, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో పునాది నిర్మించడానికే కనీసం రూ.1.5 లక్షల వరకు అవసరమవుతున్నాయి. ఇది పేద కుటుంబాల సామర్థ్యం దాటి ఉండడంతో చాలా మంది బాధపడుతున్నారు. కొందరు తమకు ఇచ్చిన శంక్షన్ లెటర్‌ను తిరిగి సర్‌రెండర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రవేశపెట్టింది. అదేమిటంటే – మహిళా సంఘాల (Self Help Groups) ద్వారా రుణం పొందడం. దీనివల్ల అర్హత కలిగిన వారు రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణాన్ని పలు మార్గాల ద్వారా పొందే వీలుంది:
- బ్యాంకు లింకేజ్ ద్వారా
- సీఐఎఫ్ (సామాజిక పెట్టుబడి నిధి) ద్వారా
- స్త్రీనిధి సంస్థ ద్వారా
ఇలా రుణం పొందాలంటే:
- లబ్ధిదారుడు లేదా వారి భార్య మహిళా సంఘ సభ్యురాలు అయి ఉండాలి.
- గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని డిఫాల్టర్లకు ఈ అవకాశం ఉండదు.
- ఇప్పటికే అప్పుల భారం ఉన్నవారు కూడా అర్హులు కాదు.
రుణం పొందిన తర్వాత పునాది నిర్మించి, ఫోటో అప్‌లోడ్ చేయగానే రూ.1 లక్ష ప్రభుత్వo ఖాతాలో జమ చేస్తుంది. ఆ డబ్బుతో రెండవ దశ ప్రారంభించవచ్చు. ఇక రుణంగా తీసుకున్న డబ్బును నెలవారీ వాయిదాలుగా (12 లేదా 22 నెలల గడువు) మహిళా సంఘాలకు తిరిగి చెల్లించవచ్చు.
సూచన:
మీరు ఇప్పటికే శంక్షన్ లెటర్‌ను పొందిన వ్యక్తి అయితే దయచేసి అది తిరిగి ఇవ్వకండి. మహిళా సంఘం ద్వారా చిన్న రుణం తీసుకొని మొదటి విడత పూర్తి చేయండి. తర్వాత ప్రభుత్వ సహాయంతో మిగతా నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా, ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ చర్యలతో రాష్ట్రంలోని పేద కుటుంబాలు తాము కలలు కనిన స్వంత ఇంటిని నిర్మించుకునే అవకాశం పొందుతున్నాయి. ఇది గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకునే దిశగా ఒక పెద్ద అడుగు అవుతుంది