హైదరాబాద్ను పగ పట్టిన కరోనా వైరస్, Corona cases increasing in HYD

 Corona cases increasing in HYD నగరంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది . వారం రోజుల క్రితం రాజధాని నగరంలో కరోనా ఉధృతి కాస్తా తగ్గుముఖం పట్టినట్టే అనిపించినా తిరిగి పుంజుకుంటోంది . నెలల పసికందులను కూడా కరోనా కాటేస్తోంది .

 హైదరాబాద్లో మొదటి కరోనా పాజిటివ్ కేసు మార్చి 2 నమోదైంది . అప్పటి నుంచి ఏప్రిల్ 12 వరకు 287 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే 199 కేసులు నమోదుకావడం Corona cases increasing in HYD కరోనా దాడి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది .

 తొలుత విదేశీయుల నుండి , ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి నుండి హైదరాబాద్ వాసులకు కరోనా సోకుతోందని వైద్య , ఆరోగ్యశాఖ వర్గాలు భావించాయి . దీంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడి హైదరాబాదు దేశీయ , అంతర్జాతీయ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయించారు .

 ఈ తరుణంలో ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనల ఉదంతం వెలుగు చూడటం , అక్కడికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులు హాజరుకావడంతో ప్రభుత్వ అంచనాలన్నీ తలకిందులయిపోయాయి . గ్రేటర్ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి .

 మర్కజ్ మూలాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడమే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య , ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి . ఇప్పటి వరకు 486 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇందులో 131మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా 16 మంది మృతి చెందారు . ఒక్క చార్మినార్ ప్రాంతంలోనే 175కు పైగా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.

 మర్కజ్ మూలాలు ఎక్కువగా ఉన్న నగరంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాదు 152 కంటైన్మెంట్ జోన్లుగా విభజించింది . శేరిలింగంపల్లి సర్కిల్ లో 14 , కూకట్ ఎల్లి సర్కిల్లో 13 , సికింద్రాబాద్లో 20 , ఖైతరాబాద్లో 52 , ఛార్మి నాలో 50 , ఎల్బీనగర్ లో 3 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు . ప్రజల రాకపో కలను కట్టడి చేసింది .

 అయినా రోజురోజుకూ కేసులు మరింత పెరుగుతుం డడం ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది . కోవిడ్ – 19 వైరస్ వ్యాప్తి నగరంలో రెండో దశను దాటి మూడో దశలోకి వెళ్లిందని చెప్పేందుకు ప్రస్తుతం రిపోర్టు అవుతున్న కేసులే నిదర్శనమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

 అయితే ముంబై , ఢిల్లీ , కోల్‌కతా , చెన్నై లాంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో వైరస్ ఉధృతి కాసింత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనుమానితులకు నిర్వహిస్తున్న నిర్ధారణ పరీక్షల్లో  హైదరాబాద్ నగరంలో ప్రతి 10 నిర్ధారణ పరీక్షల ఫలితాల్లో ఒకరికి పాజిటివ్ గా తేలుతోంది . గ్రామీణ జిల్లాల్లో మాత్రం ప్రతి 18 నిర్ధారణ పరీక్షల్లో ఒకరికి ఈ మహమ్మారిసోకుతోంది .

Related Articles

Back to top button