షాకింగ్ న్యూస్, మొన్న మర్కజ్ నేడు దేవ్ బంద్, New twist about coronavirus

 తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం కొత్త మలుపులు తిరుగుతున్నది . ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలు ఒక్కటే New twist about coronavirus నిన్నటిదాకా చర్చల్లోకి వచ్చింది . అక్కడ జరిగిన సమావేశంలో హాజరై వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకుని కరోనా క్వారంటైన్లలో ఉంచుతున్న విషయం తెలిసిందే .

  తాజాగా ఢిల్లీ నిఘావర్గాల హెచ్చరిక మేరకు ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతున్నది . ఢిల్లీలో జరిగిన సమావేశంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ , రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్ళి వచ్చిన వారిని సైతం స్క్రీనింగ్ చేయాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి .

తెలంగాణలో దేవ్ బంద్ వెళ్ళిన వారు::

 నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మత పెద్ద తొలుత ఢిల్లీ వెళ్ళారని ప్రచారం జరిగింది . ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయనతోపాటు  మరో ఇద్దరిపై పోలీసులు కేసు కూడా పెట్టారు . అయితే సదరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ లో జరిగిన సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది.

 ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం సీరియర్ గా తీసుకుంది . మార్చి నెలలో ఉత్తర భారతదేశంలోని పలు ప్రార్థనా మందిరాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు తెలుస్తోంది .

 ఢిల్లీ మర్కజో పాటు ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ , రాజసాన్లోని ఆజ్మీర్ దర్గాకు కూడా యాత్రికులు వెళ్ళినట్లు తెలుస్తోంది . మర్కా జే పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమాచారం కేంద్ర నిఘా వర్గాల నుంచి రాష్ట్రాలకు చేరింది . దీని ఆధారంగానే స్థానిక నిఘా అధికారులు పోలీసులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు .

 అనేక మంది ఢిల్లీకి వెళ్ళినప్పటికీ ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ , ఉత్తరప్రదేశ్ కు మాత్రమే వెళ్తామని చెప్పి ఇక్కడి ప్రాంతాలలో ఇష్టారీతిన తిరిగిన వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

 నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మత పెద్ద వ్యవహారమే దీనికి కారణమైంది . ఈ వ్యవహారం తర్వాత తెలంగాణ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దేవ్ బంద్ , అజ్మీరకు వెళ్ళి వచ్చిన వారి సమాచారాన్ని కూడా సేకరించి , వారిని పరీక్షల నిమిత్తం క్వారంటైన్ కు తరలిస్తున్నారు . 

 మార్చి నెలాఖరు వరకు కరోనా ప్రభావమే జిల్లాలలో కనిపించకపోగా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ వచ్చింది . అందరూ నిన్నటిదాకా ఒక మర్కజ్ పైనే దృష్టి పెట్టారు . New twist about coronavirus నిర్మల్ కేసులు వెలుగు చూసిన తర్వాత  ఇక్కడి నిఘా వర్గాలు ఉలిక్కపడ్డాయి .

 దేవ బంద్ , ఆజ్మీర్ దర్గా వ్యవహారం గురించి కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి . ఆ తర్వాత ఈ లింకుల వ్యవహారం కలవరపెడుతుంది . సమావేశాలకు వెళ్ళిన వారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది . ఇప్పటికే కొంత మంది సమావేశాలకు వెళ్ళి వచ్చిన వారు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారనే సమాచారం కూడా ఆందోళనకు కారణమవుతున్నది .

 క్రైం బ్రాంచ్ ట్రేసింగ్ ద్వారా  మర్కజ్ తో పాటు దేవ్ బంద్ , ఆజ్మీర్ వెళ్ళిన వారి సమాచారం కోసం క్రైం బ్రాంచ్ రంగంలోకి దిగినట్లు సమాచారం . వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వారి సమాచార సేకరణ కోసం పోలీసులు సిగ్నల్ ట్రేసింగ్ వినియోగిస్తూ వారినిపట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని చెబుతున్నారు .

 వీరందరి సమాచారంతో పాటు అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తే పూర్తిగా కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు .

Related Articles

Back to top button