తెలంగాణలో పది కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే, Coronavirus free districts in Telangana

 కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి స్వల్పంగా పెరిగాయి. Coronavirus free districts in Telangana ఆదివారం రాష్ట్రంలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే ఉండడం గమనార్హం . కొత్తగా 11 పాజిటివ్ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 1001కి చేరింది .

 మర్కజ్ కు వెళ్లి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన 75 ఏళ్ల వృద్ధుడు చికిత్సను పూర్తి చేసుకుని ఆదివారం డిశ్చార్జి అయ్యారు . కరోనా వైరస్ అత్యధిక కేసులు నమోదైన సూర్యాపేట , వికారాబాద్ , గద్వాల జిల్లాల్లో ఉధృతి తగ్గుముఖం పట్టింది . ఆదివారం ఈ మూడు జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు .

కరోనా వైరస్ మహమ్మారితో చనిపోయిన 25మందిలో 18మంది జీహెచ్ఎంసీకి చెందిన వారే . హైదరాబాద్ తర్వాత సూర్యాపేట జిల్లాలో 88మందికి వైరస్ సోకగా 79మంది ఆసుపత్రిలో ఉన్నారు . నలుగురు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు . నిజామాబాద్లో 61మందికి వ్యాధి సోకగా 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . 27మంది ఇళ్లకు వెళ్లిపోయారు . వికారాబాద్ జిల్లాలో 37 మందికి కరోనా సోకగా 30మంది ఆసుపత్రుల్లో ఉన్నారు . ఒకరుచనిపోగా , ఆరుగురు డిశ్చార్జి అయ్యారు .

 గద్వాల జిల్లాలో 45మందికి వైరస్ సోకగా 35మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . 9మంది డిశ్చార్జి కాగా ఒకరు మరణించారు . రంగారెడ్డి జిల్లాలో 38 మందికి వైరస్ సోకగా 21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . 10 మంది డిశ్చార్జి కాగా ఇద్దరు చనిపోయారు . మంచి ర్యాల , నారాయణ పేట జిల్లాల్లో ఒక్కొక్కరు వ్యాధి బారిన పడి మృతి చెందారు . ఈ రెండు జిల్లాల్లో ఇంత వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు . మేడ్చల్ జిల్లాలో 27 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు డిశ్చార్జి అయ్యారు . 18మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరు వైరస్ సోకి మృతిచెందారు .

Coronavirus free districts in Telangana నాగర్ కర్నూలు , ములుగు , సిద్దిపేట , మహబూబాబాద్ , మంచి ర్యాల , నారాయణపేట , వనపర్తి , యాదాద్రి భువనగిరి , వరంగల్ రూరల్ జిల్లాల్లో వైరస్ ప్రభావం లేదు . ఈ జిల్లాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి . మొత్తం మీద కరోనా మహమ్మారితో 25మంది ఇప్పటిదాకా మృత్యువాతపడగా 316మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లిపోయారు . 660మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు .

Related Articles

Back to top button