వరంగల్ లో ఒక్క రోజే 16 కేసులు,ఢిల్లీ వెళ్ళచ్చిన వారే, 19 corona cases in warangal
కరోనా వైరస్ విజృంభణ నిన్నమొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జిల్లాల్లో వరంగల్ ఒకటి . 19 corona cases in warangal శుక్రవారంనాడు ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభించడంతో అధికారులు నిర్ఘాంతపోయారు.
బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం . వరంగల్ అర్బన్ జిల్లాలోనే 19 corona cases in warangal పాజిటివ్ కేసులు నమోదు కాగా మహబూబాబాద్ , జనగామలో చేరో కేసు నమోదయినట్లు అధికారవర్గాలు తెలిపాయి . దీంతో వరంగల్ , మహబూ బాబాద్ , జనగామ జిల్లాలను అధికారులు రెజోన్‌గా ప్రకటించి లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠిన తరం చేయాలని నిర్ణయించారు.
నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ సమ్మేళనానికి జనగామ జిల్లా నుంచి హాజరై తిరిగి వచ్చిన ముగ్గురిలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్లు కలెక్టర్ కె . నిఖిల ప్రకటించారు . జిల్లా కేంద్రం నుంచి ఇద్దరు , నర్మెట్ట మండలం వెల్దండ నుంచి మరొకరు మర్కజ్ సమ్మేళనానికి వెళ్లిరాగా వెల్దండకు చెందిన వ్యక్తికి పాజిటివ్ గా నివేదిక వచ్చిందని తెలిపింది.
ఈ మేరకు సదరు వ్యక్తితో దగ్గరగా మెలిగిన 69మందిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు ఆమె చెప్పారు . మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెంకు చెందిన మాజీ మావోయిస్టుకు ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనలతో సంబంధం లేనప్పటికీ కేవలం రైలులో ప్రయాణం చేయడం ద్వారా కరోనా సోకడం కలకలం రేపింది .
ఓ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సదరు మాజీ మావోయిస్టు మార్చి 17న తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి 18న కాజీపేటలో దిగాడని , అక్కడి నుంచి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలు ద్వారా మహబూబాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో స్వ గ్రామానికి వెళ్లాడని సమాచారం . ఆ మాజీ మావోయిస్టు ఢిల్లీ నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న అధికారులు మార్చి 31న జిల్లా ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేర్పించారు .
భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వైద్యారోగ్యశాఖ అతిపెద్ద సవాలను ఎదుర్కోవాల్సి ఉం టుందని , ఇందుకు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు . ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడగా దీనివల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది .