రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీం మార్గదర్శకాలు ఇవే….
మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో రెండు పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీమ్లను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ స్కీమ్ లకు సంబంధించిన గైడ్లైన్స్ విడుదల చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇందుకు మూడు క్రైటీరియాలను ప్రకటించింది.
మహాలక్ష్మి పథకం అమలు ఇలా..
- సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 40 లక్షల లబ్దిదా రులను గుర్తించారు.
- ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికం చేశారు.
- మూడేండ్లు వినియోగించిన సిలిండర్ను పరి గణనలోకి తీసుకొని, దాని సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయిస్తారు.
- వినియోగదారులు తొలుత మొత్తం పైసలు ఇచ్చి సిలిండర్ తీసుకోవాలి. ఆ తరువాతవారి ఖాతాలోకి సబ్సిడీ డబ్బు జమ చేస్తారు.
- గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా ఎల్ పీజీ సం స్థలకు ఇవ్వనుంది. ఎల్పీజీ కంపెనీలు డీబీటీ ద్వారా వినియోగదారుల ఖాతాలో నగదు బదిలీ చేస్తాయి.
- భవిష్యత్తులో వినియోగదారులు రూ.500 చెల్లించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
- ఓఎంసీ కంపెనీలు నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మాని టరింగ్ చేయనున్నారు.
- ప్రజాపాలన పోర్టల్, సివిల్ సప్లయ్స్ డిపా ర్ట్ మెంట్ సబ్సిడీని లబ్దిదారుల వారీగా విడుద లకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గృహజ్యోతి స్కీమ్ మార్గదర్శకాలు..
- నెలకు 200 యూనిట్లలోపు వాడే వినియోగదా రులకు ఈ స్కీం అమలు చేయనున్నారు.
- ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లలో రేషన్ కార్డు, ఆధార్ కార్డులను కరెంట్ కనెక్షన్తో లిం క్ చేసి అప్రూవ్ అయిన వారికి అమలు చేస్తారు. • నెలవారీ బిల్లులో 200 యూనిట్లలోపు ఉంటే వారికి జీరో బిల్లింగ్ ఇస్తారు.
- బిల్లులో పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డుకు లింకైన కనెక్షన్కు గతంలో బిల్లులోఎవరి పేరున్నా అదే పేరుతో అమలు చేస్తారు. • ప్రతి నెలా 20వ తేదీ వరకు గృహజ్యోతి స్కీమ్ కు సంబంధించి సబ్సిడీ వివరాలను డిస్కంలు ప్రభుత్వానికి పంపిస్తాయి.
- సబ్సిడీని డిస్కంలకు సర్కారు చెల్లిస్తుంది.
- ఈ స్కీమ్లో గృహ వినియోగదారులకు కాకుండా అక్రమంగా వేరే కనెక్షన్లకు స్కీం అమలు చేస్తే విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటారు.
- 2024 మార్చి నుంచి ఈ స్కీమ్ అమలులోకి వస్తుంది.
- ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులో తెల్లరేషన్ కార్డు ఉండి అప్లై చేసుకున్న వారందరికీ ఈ స్కీమ్ అమలవుతుంది.
- అర్హత ఉండి మళ్లీ ప్రజా పాలన ద్వారా రేషన్ కార్డుతో గృహ వినియోగదారులు అప్లై చేసుకో వచ్చు. ఈ స్లిప్తో డిస్కం, ఈఆర్వో ఆఫీసును సంప్రదించాలి. వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అని తేలితే గృహజ్యోతి స్కీము అమలు చేస్తారు.