ఆ 15 మంది ఎక్కడ? క్యాంపు నుంచి మిస్సింగ్, 15 Rohingyas missing in TS
తెలంగాణకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ మొదలైంది . హైదరాబాద్ , నల్గొండ , జగిత్యాల జిల్లాలలోని రోహింగ్యా క్వారెంటైన్ లో ఉంటున్న 15 Rohingyas missing in TS పలువురు గత నెల లో ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ తల్లిగీ జమాతే సమావేశాలకు హాజరయ్యారు . అలా హాజరైన వారిలో అధిక శాతం మంది ఇప్పటి వరకు తిరిగి క్యాంపులకు చేరుకోలేదు .
ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది . ఢిల్లీలోని రోహింగ్యాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రోహింగ్యా క్యాంపులలోని పలువురు జమాత్ సమావేశాలకు హాజరయ్యారని , వీరందరినీ గుర్తించి స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది.
దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం 15 Rohingyas missing in TS హైదరాబాద్ క్యాంప్ నుంచి ఎనిమిది మంది , నల్గొండ క్యాంప్ నుంచి ఆరుగురు , జగిత్యాల క్యాంప్ నుంచి ఒకరు మర్కజ్ కు వెళ్ళి తిరిగి రాలేదని గుర్తించారు .
వీరంతా ఎక్కడ ఉన్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు . మర్కజ్ కు వెళ్ళి తిరిగి రాని వారి కుటుంబీకులతో పాటు పరిసర ప్రాంతాలు , పరిచయస్తులను ప్రశ్నిస్తున్నారు . వీరి సెల్‌ఫోన్లు కూడా పని చేయక పోవడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో 6040 మంది రోహింగ్యాలు కేంద్ర హోం శాఖ అప్రమత్తతతో పోలీసులు రోహింగ్యాలు , వారి కాంటాక్టులు గుర్తించే పనిని తీవ్రతరం చేశారు . హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధులలో దాదాపు 6040 మంది రోహింగ్యాలున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రతి క్యాంపు సునిశితంగా పరిశీ లిస్తున్నారు.
ఇందులో అత్యధికంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది ఉండటం విశేషం . వీరు బాలాపూర్ , పహాడిషరీలో ఉన్నారని , కొంత మంది చెరువులను కబ్జా చేసి షెట్లను నిర్మించుకోగా , మరికొంతమంది గుడారాలలో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు .