ప్రపంచంలో 6 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులు, 6 lakhs coronavirus cases

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ కేసుల 6 lakhs coronavirus cases సంఖ్య శనివారం నాటికి 6,00 ,000 కు చేరింది . ఐరోపా , అమెరికా దేశాల్లో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో వేగంగా బయటపడుతుండడంతో కరోనాపై సుదీర్ఘ పోరాటానికి అధికార యంత్రాంగం సిద్ధమౌతోంది.

ఇటలీ , స్పెయిన్ , చైనా , ఇరాన్ , ఫ్రాన్స్ దేశాల్లో ఒక్క రోజే 1700కు పెరిగిన మరణాలు 

 6 lakhs coronavirus cases వైరసన్ను నెమ్మది చేయడానికి ఇంకా చేయవలసిన పని చాలా ఉందని జానప్ కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది . ప్రస్తుతం 607 ,000  కేసులు నిర్దారణ కాగా , 28000 మందికి పైగా మరణించారని 130,000 మంది కోలుకున్నారని వివ రించింది .

 ప్రపంచ దేశాలన్నిటి లోనూ అమెరికాలో కేసుల సంఖ్య 104 , 000 వరకు విపరీతంగా పెరిగింది . ఇటలీ , స్పెయిన్ , చైనా , ఇరాన్ , ఫ్రాన్స్ ఈ అయిదు దేశాల్లో మరణాలు దాదాపు 1700 వరకు పెరిగాయి .

 ఈ సందర్భంగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఈ దశలో పూర్తిగా కేసులను నివారించ లేమని , భవిష్యత్తులో రోజుకు తక్కువగా కేసులు నమోదయ్యేలా తగ్గించగలమని అన్నారు . వైరస్ పాజిటివ్ ఉందని డాక్టర్ చెప్పడంతో ఆమె ఇంటివద్దనే క్వారంటైన్లో ఉన్నారు .

 ఐరోపా అంతా లాక్ డౌన్లు అమలులో ఉన్నాయి . జర్మనీలో ఏప్రిల్ 20 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని మెర్కెల్ చీఫ్ ఆఫ్ స్టాప్ హెల్త్ బ్రౌన్ చెప్పారు . స్పెయిన్లో శనివారం నాటికి 832కు మించి చనిపోయారు . 9000 మంది హెల్తు వర్కర్లు వైరస్ కు గురయ్యారు .

 కరోనా వైరస్ సోకిన మొదటి దేశాధినేత అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వీయ నిర్బంధం నుంచే తాను పనిచేస్తానని ప్రకటించారు . సరిహద్దుల్లో నిల్చిపోయిన వలస కూలీలను తరలించడానికి దేశాలు పాటుపడుతున్నాయి .

Related Articles

Back to top button