తెలంగాణలో కరోనా విజృంభణ, TS COVID positive cases

TS COVID positive cases రాష్ట్రంలో బుధవారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రాష్ట్రవ్యాప్తంగా 269 మంది కరోనా బారిన పడగా ఇందు లో 214 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది .

 తాజాగా ఒకరు మరణించడంతో .. మృతుల సంఖ్య 192 కు చేరింది . బుధవారం కరోనా వ్యాధి నయం కావడంతో 151 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు . ఇంకా 3,071 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 1,096 మందికి వైద్య పరీక్షలు నిర్వరహించగా అందులో 269 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది . 827 మందికి నెగిటివ్ వచ్చినట్టు వైద్యశాఖ తెలిపింది . ఇంకా 1959 మంది పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది .

TS COVID positive cases ::

 బుధవారం జనగామ జిల్లాలో ఐదు , జయశంకర్ భూపాలపల్లి , కొమురం భీమ్ అసిఫాబాద్ , మహబూబ్ నగర్ , వికారా బాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు . జనగామ జిల్లాలో ఐదు , కరీంనగర్‌లో 8 , మెదక్ లో మూడు , ములుగులో ఐదు , రంగారెడ్డిలో 18 , వరంగల్ అర్బన్లో పది , వనపర్తి జిల్లాలో రెండేసి కేసులు నమోదయ్యాయని పేర్కొంది . మొత్తంమీద రాష్ట్రంలో కరోనా సోకిన 5,675 ఉన్నారని అధికారులు తెలిపారు . 

Related Articles

Back to top button