రాష్ట్రంలో భారీగా నమోదైన కరోనా కేసులు, corona tally in Telangana state

corona tally in Telangana state రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య ఆరువేలు దాటింది . ఒకే రోజులో 352 కేసులు నమోదు కావడం కలకలం రేకేత్తిస్తుంది . ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో ఇంత ఎక్కువ మంది వైరస్ బారిన పడటం ఇదే మొదటి సారి . అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు చనిపోయి నట్లు అధికారులు తెలిపారు .

 కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 302 మంది ఉండగా , జిల్లాల్లో 50 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది . దీంతో రాష్ట్రంలో కరోనా బాధి తుల సంఖ్య 6027 కి చేరగా , గురువారం డిశ్చార్జ్ అయిన 230 మందిని కలుపుకొని ఇప్పటి వరకు ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 3301 కి పెరిగింది . అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2531 కి చేరుకుంది . వైరస్ దాడిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195 కి పెరిగింది .

corona tally in Telangana state ::

 గురువారం వైరస్ సోకిన వారిలో జిహెఎంసి పరిధిలో 302 మంది ఉండగా , జనగామలో 3 , జయశంకర్ భూపాలపల్లి 2 , ఖమ్మం 1 , మహబూబ్ నగర్ 2 , మంచిర్యాల 4 , మెదక్ 2 , మేడ్చల్ 10 , నల్గొండ 1 , నిజమాబాద్ 2 , రంగా రెడ్డి 17 , సంగారెడ్డి 2 , వరంగల్ రూరల్ లో ఒకరు , వరంగల్ అర్బన్లో ముగ్గురు ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది . అయితే వీరిలో జిహెచ్ఎంసి సెంట్రల్ జోన్లో పనిచేస్తున్న ఓ జోనల్ కమిషనర్ కు వైరస్ తేలింది . దీంతో పాటు ఎల్బినగర్ జిహెఎంసి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్‌కు కరోనా తేలడంతో ఆ ఆఫీలో పనిచేసే ఉద్యోగులు , సిబ్బంది ఆందోళనలో ఉన్నారు .

 టిఆర్ఎస్ నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర్ రావు కారు డ్రైవరకు కరోనా వైరస్ పాజిటీవ్ గా నమోదు అయ్యింది . గత కొన్ని రోజుల నుంచి హైద్రాబాద్ లో తిరగడం వల్ల అతనికి సోకినట్లు తెలుస్తోంది . దీంతో ఎంపి నామా హోంక్వారంటైన్ లోకి వెళ్ళారు .

Related Articles

Back to top button