రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, telangana COVID19 update

 రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. telangana COVID19 update శుక్రవారం ఒక్కరోజే 499 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 329 కేసులు నమోదు కాగా , రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారే కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగాయి . 129 పాజిటివ్ కేసులతో జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది .

 రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 2,477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 499 మందికి ఈ మహమ్మారి సోకినట్టు పరీక్షల ఫ లితాల్లో వెల్లడైంది . 1,978 మందికి నెగిటివ్ తేలింది . కరోనాతో తాజాగా ముగ్గురు మరణించగా ఈ సంఖ్య 198 కి చేరింది . రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,526 పాజిటివ్ కేసులు నమోదు కాగా , 9,352 మంది డిశ్చార్జ్ అయ్యారు . ఆసుపత్రుల్లో 2,976 మంది చికిత్స పొందుతున్నారు . ఈ వ్యాధి నయం కావడంతో 51 మంది డిశ్చార్జ్ అయ్యారు .

 ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో 34 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది . ప్రైవేట్ ఆసుపత్రుల్లో 17,081 పడకలనుక రోనా వ్యాధిగ్రస్తులకు కేటాయించారని ఇప్పటికే 976 మంది ఆయా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది . కరోనా ఆసుపత్రుల్లో 10,970 పడకలు  ఖాళీగా ఉన్నాయని ఆక్సిజన్ సపోర్టుతో 3,227 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది .

telangana COVID19 update ::

 రాష్ట్రంలో గాంధీ వైద్య కళాశాల , ఉస్మానియా సాధారణ ఆసుపత్రి , నల్లకుంట ఫీవర్ ఆసుపత్రితో పాటు పంజగుట్టలోని నిమ్స్ , నారాయణగూడలోని ఐటీఎం , వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల , సీసీఎంబీ , డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ , హైదరాబాద్ లోని ఈఎన్ఏ వైద్య కళాశాల , ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రుల్లో కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది .

 గచ్చిబౌలిలో 33 మందికి సోకిన వైరస్ గచ్చిబౌలి ప్రాంతంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో కరోనా విజృంభించింది . శుక్రవారం ఒక్కరోజే 38 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు . ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బందితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం 38 మందికి కరోనా పాజిటివ్ తేలినట్టు అధికారులు ధృవీకరించారు . మొత్తం 95 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది . ఇంకా 15 మంది రిపోర్టులు రావలసి ఉంది . 

Related Articles

Back to top button