రాష్ట్రంలో కరోనా వికృత రూపం, Spike in Telangana COVID19 cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. Spike in Telangana COVID19 cases రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి . నమోదవుతున్న పాజిటివ్ కేసుల రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి . తాజాగా ఒక్క శనివారమే 546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని హెల్త్ బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది .

 ఒక్కరోజే అయిదు వందలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం . కొత్తగా నమోదైన 546 కేసులను కలుపుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7072 కు ఎగబాకింది . కరోనా సోకడంతో చికిత్స పొంది శనివారం 154 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు మొత్తం 3506 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు . ఇంకా 3863 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాతో చికిత్స పొందుతున్నారు . మరో అయిదు మందికరోనా బారిన పడి మృతిచెందారు . దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 203 కు చేరుకుంది .

Spike in Telangana COVID19 cases ::

 శనివారం గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కేసులను గుర్తించారు . ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డుస్థాయిలో అత్యధికంగా 458 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది . రంగారెడ్డి జిల్లాలో 50 , కరీంనగర్ లో 18 , జనగామలో 10 , మేడ్చల్ లో 6 , మహబూబ్ నగర్ లో 3 , వరంగల్ రూరల్ లో 2 , వరంగల్ అర్బన్లో ఒక కేసును గుర్తించారు . ఇక శనివారం ఒక్క రోజునే 3188 టెస్టులు చేశారు . వీటిలో నుంచే 546 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి . దీంతో మొత్తం ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 58,575 కు చేరింది . శనివారం 2642 ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి .

  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎఎన్ కాలనీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు ధృవీకరించారు . ఇప్పటికి షాద్ నగర్ లో కరోనా కేసుల సంఖ్య 30 కి చేరింది . కరోనా విపత్కర కాలంలో జర్నలిస్టుల భద్రతపై చేసిన ఫిర్యాదుకు మానవహక్కుల కమిషన్ స్పందించింది . జర్నలిస్టు మనోజ్ మృతిపై ఆగస్టు 17 లోపు నివేదిక ఇవ్వాలని గాంధీ సూపరింటెండెంటు ఆదేశాలు జారీ చేసింది ..

Related Articles

Back to top button