గాంధీ సిబ్బంది నిర్వాకం, Missing person dead body in Gandhi
మరోసారి బయటపడిన గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం సిబ్బంది. Missing person dead body in Gandhi నిర్లక్ష్యంపై విచారణ జరుపుతున్న పోలీసులు. సిబ్బంది నిర్లక్ష్యంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది . 20 రోజుల క్రితం గాంధీలో అనారోగ్యంతో చేరిన నరేంద్ర సింగ్ అనే వ్యక్తి వయస్సును 39 కు బదులు 69 గా వైద్య సిబ్బంది నమోదు చేశారు .
Missing person dead body in Gandhi ::
నరేంద్రసింగ్ చనిపోయిన తర్వాత అనాథ శవంగా మార్చురికి తరలించారు . సిబ్బంది తీరుపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . 20 రోజుల పాటు పోస్టుమార్టం గదిలోనే నరేంద్రసింగ్ మృతదేహాన్ని అనాథ శవంగా ఉంచడం విమర్శలకు దారితీస్తోంది . సరిగ్గా 20 రోజుల క్రితం అనారోగ్యంతో కింగ్ కోఠిలోని ఆసుపత్రికి నరేంద్రసింగ్ వెళ్లాడు . కరోనా లక్షణాలున్నాయని గాంధీకి పంపడంతో కరోనా పరీక్షలు నిర్వహించింది. ఉన్నది లేనిది కూడా కుటుంబ సభ్యులకు గాంధీ సిబ్బంది సమాచారం ఇవ్వలేదు .
మే 31 వరకు గాంధీలోనే ఉన్నట్లు నరేంద్ర సింగ్ కుటుంబ సభ్యులకు తెలిపాడు . తర్వాత రోజు నుంచి ఆయన ఫోన్ స్విఛాఫ్ వచ్చింది . దీంతో అసలు నరేంద్రసింగ్ ఏమైపోయాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందారు . దీంతో ఈ నెల 6 న మంగల్ హాట్ పోలీస్ స్టేషన్లో నరేంద్రసింగ్ పేరుతో మిస్సింగ్ కేసు నమోదైంది . పోలీసులు సీసీ కెమెరాలతోపాటు మృతుడి కాల్ డేటా ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు . గాంధీ ఆసుపత్రి మార్చురిలో అనాథ శవాల పట్టికలో నరేంద్రసింగ్ పేరుతో వెతికారు . అయినప్పటికీ గాంధీ మార్చురీలోనే నరేంద్రసింగ్ శవం ఉన్నా ఆయన వివరాలు మార్చురీ పట్టికలో లేవు . మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు 69 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ మృతదేహం మార్చురీలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది . ఈ క్రమంలో నరేంద్రసింగ్ కుటుంబ సభ్యులను తీసుకువచ్చి చూపగా వారు గుర్తించారు . దీంతో ఈ నిర్లక్ష్యం ఎలా జరిగిం దన్న కోణంలోనూ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు .
One Comment