Telangana state intermediate results 2020

నేడే Telangana state intermediate results ఇంటర్ ఫలితాలు ఫస్ట్ , సెకండియర్ ఫలితాలు ఒకేసారి మధ్యాహ్నం మూడింటికి ఫలితాలు విడుదలచేయనున్న విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

 ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి . మధ్యా హ్నం 3 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాల యంలో అధికారులు , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటిస్తారని బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ చెప్పారు . Telangana state intermediate results ఫస్టియర్ తో పాటు సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు . ఫలితాల విడుదలకు సంబంధించి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మంత్రి సబిత బుధవారం చర్చించారు .

Check your results ::

the official websites- tsbie.cgg.gov.in, results.cgg.gov.in.

 మూడు రోజుల క్రితమే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను పూర్తిచేసిన ఇంటర్ బోర్డు ఫలితాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసింది . రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలుక కుడా ప్రకటించనున్నారు . ఫలితాలతో పాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కాల పట్టికను , పరీక్ష ఫీజు చెల్లించే తేదీ గడువును ఈ సందర్భంగా ప్రకటించనున్నట్టు చెప్పారు . జులై మూడో వారంలో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.

Related Articles

Back to top button