రాష్ట్రంలో కోరలు చాస్తున్న కరోనా, Rapidly increasing COVID19 cases in TS
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. Rapidly increasing COVID19 cases in TS రోజురోజుకు వందల్లో కేసులు పెరిగిపోతున్నాయి . సోమవారం ఒక్కరోజే 872 పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఇందులో 713 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది .. ఈ ఒక్క రోజే కరోనాతో ఒక ఫిజీషియన్ తో సహా ఏడుగురు మరణించారు . కరోనాతో ఓవైద్యుడు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమం . ఇప్పటి దాకాచనిపోయిన వారి సంఖ్య 217 కు చేరింది .
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 3,189 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 872 మందికి మహమ్మారి సోకినట్టు వైద్యులు గుర్తించారు . 2317 మంది నమూనాలు సేకరించి పరీక్షిస్తే నేగిటివ్ ఫలితాలు వచ్చాయి . ఇప్పటిదాకా కరోనా బారినపడిన వారి సంఖ్య 8,674 ఉండగా , డిశ్చార్జ్ తర్వాత 4,452 మంది ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్నారు . కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన 4005 మందిని వైద్యులు తమ ఇళ్ళకు పంపించారు .
Rapidly increasing COVID19 cases in TS ::
జీహెచ్ ఎంసీ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధి కంగా 107 పాజిటివ్ కేసులు నమోద య్యాయి . మేడ్చల్ జిల్లాలో 16 , మంచిర్యాలలో 5 , సంగారెడ్డి జిల్లాలో 12 , వరంగల్ అర్బన్ 1 , వరంగల్ రూరల్ లో 6 , జనగామ , కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు చొప్పున , కామారెడ్డి , మెదక్ జిల్లాల్లో మూడేసీ కేసులు సోమవారం నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది .
కుత్బుల్లాపూర్ పరిధిలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయం లో కరోనా కలకలం సృష్టించింది . కార్యాలయంలోని 13 మంది సిబ్బందికి మహమ్మారి సోకింది . ఇంజనీరింగ్ విభాగంలో డీఏవోకు కరోనా నిర్ధారణ అయింది . మునిసిపల్ ఆఫీస్ ను సిబ్బంది శానిటైజ్ చేశారు .
నిజాంపేట్ నగర పాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది . నగర పాలక సంస్థలో అత్యవసర సేవలు మినహా ప్రజలెవరూ కార్యాలయా నికి రావొద్దని అధికారులు తెలిపారు . మలక్ పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తొమ్మిది మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు అధికా రులు వెల్లడించారు . రెండు రోజులపాటు ఆపరేషన్ థియేటర్ , లేబర్ రూమ్ మూసివేసినట్లు పేర్కొన్నా రు.కూకట్ పల్లి , మూసాపేట సర్కిల్ లో నివాసం ఉండే అన్నదమ్ములకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది .
One Comment