తెలంగాణలో కరోనా ఉగ్ర రూపం, COVID19 cases raising in Telangana
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. COVID19 cases raising in Telangana రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు . శనివారం 546 పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఆదివారం ఈ కేసులు అమాంతం పెరిగిపోయి 780 కి చేరాయి . గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది . కరోనా టెస్టులు చేసే కొద్దీ జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు .
ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 659 అత్యధిక కేసులు నమోదయ్యాయి . గత మూడు మాసాల్లో ఇంత పెద్దఎత్తున రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం . జనగామ జిల్లాలో తొలుత ఒకటి , రెండు పాజిటివ్ కేసులు వచ్చినా ఆ తర్వాత ఈ జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలవల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు . తాజాగా 34 పాజిటివ్ కేసులు రావడం జిల్లా అధికారులను వేధిస్తోంది . దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్న యి
COVID19 cases raising in Telangana ::
రంగారెడ్డి జిల్లాలో పది , మేడ్చల్ జిల్లాలో తొమ్మిది , ఆసిఫాబాద్ మూడు , వరంగల్ జిల్లాలో ఆరు , వికారాబాద్ రెండు , సంగారెడ్డి , ఆదిలాబాద్ , కొత్తగూడెం , నారాయపేట , మెదక్ , నల్గొండ , యాదాద్రి జిల్లాల్లో ఆదివారం ఒక్కో నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది . ఆదివారం ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మరణించగా ఇప్పటిదాకా ఈ మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య 210 కి చేరింది . ఆదివారం 3,297 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా 2,567 మందికి నెగిటివ్ రాగా , 780 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది . ఆదివారం 227 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటిదాకా వ్యాధి సోకి ఆసుపత్రిలో చేరి నయం కావడంతో 3,731 మంది తమ ఇళ్ళకు పంపించారు . తాజాగా నమోదైన 780 కేసులు కలుపుకుని రాష్ట్రంలో కోవిడ్ -19 బారిన పడ్డ వారి సంఖ్య 7,802 కు చేరింది .