తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, COVID19 positive cases in TS
కరోనా మహమ్మారి రాష్ట్రంలో మరొకరిని పొట్టనబెట్టుకుంది COVID19 positive cases in TS 1061 చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ వైద్య , ఆరోగ్యశాఖ తెలిపింది . దీంతో తెలంగాణలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 29కు చేరుకుంది .
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతున్నాయి . శనివారం తెలంగాణలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య COVID19 positive cases in TS 1061కు చేరుకుంది . కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకోవడంతో శనివారం 35మందిని డిశ్చార్జి చేశారు . ఇప్పటి వరకు కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయిన వారి సంఖ్య 499కి చేరుకుంది . ఇంకా 588మంది రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు .
శనివారం డిశ్చార్జి అయిన వారిలో 24మంది హైదరాబాద్ కు చెందిన వారు కాగా నలుగురు సూర్యాపేట , నలుగురు వికారాబాద్ , ఆసీఫాబాద్ , నిజామాబాద్ , ఖమ్మంకు చెందిన వారు ఒక్కరొక్కరు ఉన్నారు . కాగా శనివారం నమోదైన 17 కరోనా పాజిటివ్ కేసుల్లో 15 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం . మిగతా రెండు పాజిటివ్ కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి .
వరంగల్ రూరల్ , యాదాద్రి భువనగిరి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాలేదు . 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్నవారే కరోనా బారిన ఎక్కువగా పడుతున్నట్లు తేలింది . 21 – 30 మధ్య వయస్సు వారు 21శాతం , 31 – 40 శాతం మధ్యన ఉన్నవారు 19శాతం , 41 – 50 మధ్యన ఉన్నవారు 15శాతం కరోనా బారిన పడుతున్నారు . కరోనా పాజిటివ్ కేసుల్లో పురుషులె ( 66 . 5శాతం ) ఎక్కువగా ఉన్నారు . కరోనా బారిన పడిన మహిళలు 33 . 5శాతం మాత్రమే .
మాస్క్ లేకుండా బయటకు వస్తే…! సెక్షన్ 188, 269,270… అంతేకాకుండా
5 Comments