మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం, Corona cases in mancherial district
మంచిర్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ ఘంటికలు మళ్లీ మోగాయి. Corona cases in mancherial district ఆదివారం హాజీపూర్ ఒక్కసారిగా మండలంలో కలకలం మొదలైంది . . ఇటీవల ముంబాయి నుంచి వచ్చిన ముగ్గురు వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు . హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వలస కార్మికులు మహారాష్ట్రలోని ముంబాయి నుంచి వచ్చారు . దీంతో గ్రామస్తులు వారిని ఊరి పొలిమేరల్లో ఉంచి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి హైదరాబాదు పంపారు .
పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు . అనంతరం ముగ్గురిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు . జిల్లాకు వచ్చిన వలస కార్మికులు కరోనాపై పూర్తి అవగాహన ఉండడం ద్వారా గ్రామంలోకి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు . ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారి నీరజను వివరణ కోరగా రాపల్లి గ్రామానికి వచ్చిన ముగ్గురు ఈ ప్రాంతంలో ఎవరినీ కలవలేదని , వారు ముగ్గురు ఒక ప్రత్యేక వాహనంలో గ్రామానికి వచ్చారని , వారిని వెంటనే బెల్లంపల్లిలోని క్వారంటైన్ వార్డుకు తరలించడం జరిగిందన్నారు . వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపినట్లు తెలిపారు .
Corona cases in mancherial district ::
జిల్లాకు వచ్చిన ఆ వలన కార్మికులకు కరోనాపై పూర్తి అవగాహన ఉండటం ద్వారా గ్రామంలోకి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఎవరికి ఆ వైరస్ అంటకుండా జాగ్రత్త పడ్డారు . ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంచార్జి అధికారి డాక్టర్ నీరలు వివరణ కోరగా రాపల్లి గ్రామానికి వచ్చిన ముగ్గురు ఈ ప్రాంతంలలో ఏ ఒక్కరిని కలవలేదని , వారు ముగ్గురు ఒక ప్రత్యేక వాహనంలో గ్రామానికి వచ్చారని , వారిని వెంటనే బెల్లంపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించడం జరిగిందని , వైద్య పరీక్షల్లో వారికి కరోవా పాజిటీవ్ రావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు .
జిల్లాకు వేలాది మంది వలస కూలీలు వస్తున్నారని , వారందరికి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే వైద్య పరీక్షలను నిర్వహించి హోం క్వారంటైన్ చేస్తున్నామని , కరోనా లక్షణాలు కల్పించిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని ఆమె తెలిపారు . దూర ప్రాంతం నుండి వచ్చిన వలన కార్మికులందరికి పరీక్షలు నిర్వహించడం కష్టంగా ఉంటుందని , లక్షణాలు ఉన్న వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని , ప్రజలు దీన్ని గమనించాలని , వైద్యులపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె కోరారు . వలస కార్మికులకు కరోవా పాజిటీవ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది . ఆ గ్రామంలోని ప్రజలందరిని ఆందోళన చెందవద్దని , జిల్లా వైద్య శాఖ అధికారులు , పోలీస్ అధికారులు గ్రామాన్ని సందర్శించి వారికి ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తెలిపారు .
వలస కార్మికులు ఎవరిని కలవకపోవడం మంచిదైందని తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు రాపల్లి ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని , ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు . మంచిర్యాల జిల్లా ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో ఉండటం , ఇప్పటి వరకు ఒక కేసు నమోదు కావడం , తదనంతరం శనివారం వలస కార్మికులకు ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది . ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కరోనా పాజిటీవ్ వస్తే జిల్లా పరిధిలోకి వచ్చే కరోనా కేసుల్లో వీటిని కలపడం జరగదని , ఈ వ్యవహారం అంతా రాష్ట్ర పరిధిలో ఉంటుందని జిల్లా వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు .
2 Comments