కరోనా కొత్త రూపం, ఆందోళనలో వైద్యులు, CoVID19 new symptoms

ఎటువంటి లక్షణాలు లేకుండానే CoVID19 new symptoms కరోనా వైరస్ వారంకంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి సోకుతుందని టెక్సాస్ యూనివర్సిటీలోని అంటువ్యాధి పరిశోధకులు గుర్తించారు . లక్షణాలు లేకుండానే 10 శాతం కంటే ఎక్కువమందికి వైరస్ సోకిన విషయం కూడా తెలియకుండానే వ్యాప్తి చెందినట్లు నిర్ధారించారు .

 ఎమెర్డింగ్ ఇన్ఫక్షియస్ డిసీజెస్ అనే అంశంలో అమెరికా , ఫ్రాన్స్ , చైనా . హాంకాంగ్ శాస్త్రవేత్తల బృందం వైరస్ యొక్క సీరియల్ విరామం అనే తీరుపై అధ్యయనం చేసింది . ఇందులో సీరియల్ విరామాన్ని లెక్కించేందుకు వైరస్ ఉన్న ఇద్దరు వ్యక్తులలో లక్షణాలు కనిపించేందుకు తీసుకునే సమయాన్ని గణించారు . చైనాలో కరోనా వైరస్ సగటు విరామం నాలుగు రోజులుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు . అసింప్టోమాటిక్ ట్రాన్స్మిషన్ రేటును అంచనా వేసిన అధ్యయనాల్లో ఇదే కీలకమైంది .

 సాధారణంగా కరోనా వైరస్ రెండు అంశాలపై ఆధార పడినట్లుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు . CoVID19 new symptoms అంటువ్యాధి వేగం ప్రతీ కేసు నుంచి ఎంతమందికి సోకుతుంది , వ్యక్తుల మధ్య సంక్రమణ వ్యాప్తికి ఎంత సమయం పడుతుందనే అంశాలపై ఆధారపడి ఉందని తేల్చారు . మొదటి పరిమా ణాన్ని పునరుత్పత్తి సంఖ్యగా , రెండోది సీరియల్ విరామంగా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు . కోవిడ్ 19 సీరియల్ విరామం తీవ్రమైందని , వ్యాప్తి అధికంగా ఉండే ఈ వ్యాధి త్వరగా పెరుగుతుందని , ఆపేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారు .

 ఎబోలా ఎక్కువ కాలం సీరియల్ విరామం తీసుకోగా , ఇన్ఫ్లు యోంజా సులభంగా తక్కువ రోజులకే పరిమితమైనట్లుగా నివేదికలో పేర్కొన్నారు . ఈ బృందం చైనాలోని 93 నగరాల్లో 450కిపైగా ఇన్ఫెక్షన్ కేసులను పరిశీలించింది . ఇందులో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి . ఎటువంటి లక్షణాలు లేని వ్యక్తులు వైరసన్ను త్వరగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నారనే బలమైన ఆధారాలను కనుగొన్నారు . దీనిని ప్రీ సిప్టోమాటిక్ ట్రాన్స్మిషన్‌గా పేర్కొంటారని , 10మందిలో ఒకరికి ఎటువంటి అనారోగ్యం కనిపించకుండానే గుప్తంగా ఉంటున్నాయని తేల్చారు .

ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి విస్తృతికి గబ్బిలాలకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించాయి . అయితే తాజాగా గబ్బిలాలు కూడా పాటిస్తాయని టెక్సాస్ విశ్వ విద్యాలయం చేసిన పరిశోధనల్లో ఈ దిగ్ర్భాంతికర విషయం వెల్లడైంది . భౌతిక దూరం పాటిం చడంతో గబ్బిలాలు ఎప్పటి నుంచో మనకంటే ముందు వరుసలో నిల్చాయని వారు గుర్తించారు . గబ్బిలాలు అనారోగ్యానికి గురైనప్పుడు వాటికవే సామాజిక దూరం పాటిస్తాయని , వాటికి ఇతర ఆరోగ్యకరమైన గబ్బిలాలు ఆహారం సమకూరుస్తూ దూరంగా ఉంటాయని పరిశోధ కులు కనుక్కొన్నారు . 

Related Articles

Back to top button