తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, COVID19 cases in Hyderabad

రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ COVID19 cases in Hyderabad విజృంభిస్తోంది, మొన్నటి దాకా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ 20 లోపే ఉంటే, శనివారం నాడు గ్రేటర్ లో 30 కేసులు నమోదయ్యాయి ఇందులో ఒక   కేసు వలస వచ్చిన వారు ఉన్న రు.

 తెలంగాణలో మొత్తం శనివారం నాడు 31 కేసులు నమోదవగ ఒకరి మృతి చెందారు. కరోనా వైరస్ గ్రేటర్ హైదరా బాద్ పై మరోసారి  ప్రతాపం చూపింది .COVID19 cases in Hyderabad ఒక్కరోజే 30 కేసులు నమోద య్యాయి . మరోకటి వలస కేసు నమోదు కావటంతో తెలంగాణలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖతాజా బులిటెన్లో వెల్లడించింది . దాంతో రాష్ట్రం లో ఇప్పటివరకు 1 , 163 మందికి కరోనా సోకింది . శనివారం కరోనాతో ఒకరు మృతి చెందారు . దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది .

 కరోనా నుంచి కోలుకొని 24 మంది డిశ్చా ర్జి అయ్యారు . ఇప్పటివరకు కోలుకొని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 751కి చేరిందని వైద్యశాఖ పేర్కొంది . చికిత్సలో 38 మంది ఉన్నారు . తల్లి నుంచి బిడ్డకు సోకని కరోనా – శిశువుకు రక్షణ చర్యలతో శుక్రవారం గాంధీలో కరోనా గర్భిణికి పుట్టిన బిడ్డకు కరోనా నెగిటివ్ అని తేలటంతో వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు .

 తల్లికి కరోనా ఉన్నందుకు బిడ్డకు సోకుతుందేమోనని వైద్యులు భావించారు . కానీ శిశువుకు కరోనా టెస్టు ఫలితంలో శనివారం నెగెటివ్ అని తేలింది . దాంతో తల్లిద్వారా కరోనా సోకే అవకాశం లేదని తేలిపోయిందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు . దాంతో ఆ బాబుకు కరోనా సోకకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు . తల్లి నుంచి వేరు చేసి తల్లిపాల నిధి కేంద్రాల పాలు పట్టించాలా  లేదా ఇతర జాగ్రత్తలు పాటించి తల్లిపాలను పట్టించాలా అనే విషయాలపై వైద్యులు దృష్టి సారించారు . ఒకవేళ తల్లి పాలు ఇవ్వటం తప్పనిసరైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు .

 మరోవైపు కరోనా కట్టడికి లాక్ డౌనను ఏ విధంగా అమలు చేస్తోంది , వైరస్ నివారణ చర్యలు ఎలా కొనసాగుతున్నాయ . . ? తదితర అంశాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రానికి త్వరలో మరో కేంద్ర బృందం రానుంది . కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి త్వశాఖ పంపింది . వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు 10 రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు ఈ బృందాలు సహాయం చేస్తాయి . గుజరాత్ , తమిళనాడు , ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ , రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , పంజాబ్ , పశ్చిమబెంగాల్ , ఏపీ , తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను నియమించింది .

Related Articles

Back to top button