Trending

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, COVID19 positive cases in Telangana

తెలంగాణలో ఆదివారం రోజు COVID19 positive cases in Telangana జిహెచ్ఎంసి పరిధిలోనే 26 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి మరియు వైరస్ ఏడుగురు వలసకూలీలకు సోకడంతో టెన్షన్ నెలకొంది.

  రాష్ట్రంలో ఆదివారం 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది . ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది . ఆ 33 కేసుల్లో 26 హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి . హైదరాబాద్లో రోజురోజుకీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది . తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 1196కు చేరింది . ఇప్పటివరకూ 751 గాంధీలో చికిత్స పొంది కోలుకున్నారు . 30 మంది చనిపోయిన విషయం విదితమే . దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 415 ఉన్నాయి .

 ఇప్పటిదాకా వరంగల్ రూరల్ , యాదాద్రి భద్రాద్రి , వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు , 24 జిల్లాల్లో 14 రోజులుగా కొత్తగా కేసులు రాకపోవడం శుభపరిణామం . అయితే , తాజాగా యాదాద్రి జిల్లాలో తొలిసారి నాలుగు కేసులు నమోదుకాగా దాన్ని వైద్యారోగ్య శాఖ వలస కూలీల జాబితాలో పొందుపర్చింది . ఆత్మకూర్ ( ఎం ) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన కొందరు పొట్టకూటి కోసం మహారాష్ట్రకు వెళ్లారు . అక్కడ పనుల్లేక , భోజన సౌకర్యాల్లేక అష్టకష్టాలు పడుతూ ఈ నెల 6న సొంతూరైన పల్లెర్లకు చేరుకున్నారు . వారిలో ముగ్గురికి కరోనా ఉన్నట్టు తేలింది .

 అదే జిల్లాలోని నారాయణపురం మండలం జనగామకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది . అతను కూడా మహారాష్ట్ర నుంచి నాలుగురోజుల క్రితం వచ్చాడు . మంచిర్యాల జిల్లాకు చెందిన మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది . ఈ ఏడుగురినీ వైద్యారోగ్య శాఖ వలసకూలీల జాబితాలో చేర్చింది . దీంతో మహారాష్ట్ర హైదరాబాద్ , ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చేవారిని ఆయా జిల్లాల్లో ప్రజలు ఊర్లోకి రానివ్వడం లేదు . ఒకవేళ రానిచ్చినా వారికి స్కూల్లోనో , హెూం క్వారంబైలోనో ఉంచుతున్నారు . గ్రామస్తులే వారికి కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు .

మద్యం అమ్మకాలు కర్ణాటక రికార్డ్ తమిళనాడు గిన్నిస్ రికార్డ్…

ఈన్నాళ్లూ ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్‌గా కొనసాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకేసారి నలుగురికి కరోనా మైస్ సోకింది . అయితే వీరంతా ముంబై నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలని అధికారులు తెలిపారు . స్వగ్రామానికి వచ్చిన వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా క రోనా పాజిటివ్ గా తేలింది . జిల్లాలోని ఆత్మకూరు మండలంలో ముగ్గురికి , సంస్థానానారాయణపురం మండలంలో ఒకరికి వ్యాధి సోకినట్లు అధికారులు ధృవీకరించారు .

COVID19 positive cases in Telangana ::

 కరోనా సోకిన వారు వలసకూలీలని తేలడంతో జిల్లాలో కలకలం రేగింది . రెండు మండలాలోని బాధిత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు . వైద్య , ఆరోగ్యశాఖ బృందాలు ఈ రెండు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు . పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు . ఈ జిల్లాలో ఆదివారం నిర్ధారణ అయిన నాలుగు పాజిటివ్ కోవిడ్ కేసులతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తంక రోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 100 దాటింది . ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 102కు చేరుకుందని అధికారులు నిర్ధారించారు . సూర్యాపేట జిల్లాలో 88 , నల్గొండ జిల్లాలో 15 , యాదాద్రి జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి .

 శనివారం వరకు నల్గొండ జిల్లాలో అందరూ డిశ్చార్జి కాగా సూర్యాపేట జిల్లాలో 59మంది వ్యాధినయం కావడంతో ఇళ్లకు చేరారు . సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఇంకా 24మంది చికిత్స పొందుతున్నారు . ఆదివారం బయటపడిన నాలుగు పాజిటివ్ కేసులతో కలిపి ఉమ్మడి జిల్లాలో 28 కేసులు యాక్టివ్ కేసులని అధికారులు తెలిపారు . ఈ జిల్లాలోనే ఆత్మకూరు మండలంలోని ముగ్గురు బాధితులకు సంబంధించి వారి అయిదుగురు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి ఆసుపత్రికి పంపించారు .

Related Articles

Back to top button