కరీంనగర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్, Gas leakage in paper mil
తెలంగాణలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులో మరోసారి ప్రమాదం జరిగింది . Gas leakage in paper mil లీక్ అవడంతో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు . బాధిత కార్మికుడు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మొదటి షిప్టులో ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో 55 మంది కార్మికులు విధులకు హాజరయ్యారు .
ఉదయం ఆరున్నర సమయంలో ఈ డిపార్ట్మెంట్ కు సమీపంలోనే ఫైబర్ లైన్లో గ్యాస్ లీకై ఆ ప్రాంతమంతా వ్యాపించింది . దీనితో కార్మికులు మిల్లులో పరుగులు తీశారు . ఫినిషింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన 16 మంది కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురి కాగా తర్వాత పరిస్థితి ఇబ్బంది కరంగా మారి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం , తలనొప్పి , అయాసం రావడంతో సూపర్వైజర్‌కు చెప్పి ఇండ్లకు వెళ్లారు .
ఇందులో నౌగాంబస్తీకి చెందిన నాగుల రాజం అనే కాంట్రాక్టు కార్మికుడు ఇంటికి వెళ్లిన అనంతరం కడుపు ఉబ్బి తీవ్ర అస్వస్థతకు గురి కాగా , కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు .
ఆయనను కాగజ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . Gas leakage in paper mil లీకేజి కారణంగా కార్మికుడు ఆసుపత్రి పాలైన విషయం మీడియా ద్వారా బయటికి రావడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది . వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు . ఈ మేరకు ఇంచార్జి తహసీల్దార్ లింగమూర్తి , ఇంచార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ , ఇండస్ట్రీ ప్రమోషన్ అధికారి అశోక్ తో కలిసి మిల్లులో విచారణ చేపట్టారు .
కంపెనీలో క్లోరిన్ గ్యాస్ లీకేజి అయి కార్మికులు అస్వస్థకు గురైనట్లు వార్తలు వెలువడ్డాయి . ఈమేరకు విచారణ తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి కంపెనీలోని మిల్లు ప్రతినిధులు , సంబంధిత డిపార్ట్ మెంట్లోని కార్మికులు వాయువు లీకైన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు . కంపెనీలో లీకైంది క్లోరిన్ వాయువా లేక హెపీఎల్ గ్యాసా అన్నది తేలాల్సి ఉంది . ఈ విషయంపై విచారణ అధికారి లింగమూర్తి మాట్లాడుతూ పూర్తి నివేదికను జిల్లా ఉన్నాధికారులకు అందజేస్తానని పేర్కొన్నారు .
ఇదిలా ఉంటే ఎస్పీయం యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది . జేకే కంపెని వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్ మిల్లులో జరిగిన ఘటనకు సంబంధించి వివరణ ఇస్తు మిల్లులో జరిగిన గ్యాస్ లీకేజి ఘటన ప్రమాదకరమైంది కాదని రోజువారి కార్యక్రమాల్లో భాగంగా జరిగే ప్రక్రియలో హెచ్ సిఎల్ గ్యాస్ సరఫరా అయ్యే పైన్లైన్ బోల్ట్ విరగడంతో ఇలా జరిగిందని , ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు .