కూలీల కు 40 ప్రత్యేక రైళ్లు, Special trains for migrant workers

 దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు Special trains for migrant workers ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు తెలిపారు . మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు .

Special trains for migrant workers

 హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్ , ఖమ్మం , రామగుండం , దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు . బీహార్ , ఒడిస్సా , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు . లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్లో ఉన్న స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు . హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై సుదీర్ఘంగా చర్చించారు .

 తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి migrant workers తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు . ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో మాట్లాడి , మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు . అందుకు ఆయన అంగీకారం తెలిపారు . పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు వలస కార్మికలు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కార్మికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు , రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని ఆటంటకం లేకుండా చూసేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా , సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది .

 తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు . అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు . పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు . తెలంగాణ ప్రభుత్వం కార్మికులను తమసొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు . ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి , కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు . ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , సిఎస్ సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button