ఇండియాలో కరోనా కల్లోలం, 50 thousand coronavirus cases in India
ఇండియాలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు, 50 thousand coronavirus cases in India శుక్రవారం ఒక్క రోజే 3 , 390 కేసులు నమోదయ్యాయి మరియు 103 మంది మృతి చెందారు. 216 జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెెళ్ళదించారు .
21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . 3390 కొత్త కేసులు నమోదు కాగా , 108మంది మరణించారు . అలాగే , 1273 మంది డిశ్చార్జ్ అయ్యారు . దీంతో ఇప్పటి వరకు 16 , 540 మంది డిశ్చార్ అయ్యారు . 37916 మంది యాక్టివ్ కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిలవ్ అగర్వాల్ ప్రకటించారు .
దేశంలో కరోనా నుంచి కోలుకునేవారి శాతం 29 . 36గా ఉందని తెలిపారు . మొత్తం చనిపోయిన వారు 1886 కాగా , 50 thousand coronavirus cases in India మొత్తం కరోనా కేసుల సంఖ్య 56 , 342గా నమోదైంది . దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటివరకు కరోనావైరస్ కేసులు నమోదు కాలేదు . అలాగే 42 జిల్లాల్లో గడిచిన 28 రోజులుగా , 29 జిల్లాల్లో గడిచిన 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది .
గడిచిన 14 రోజుల్లో 36 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు . అలాగే గత వారం రోజుల్లో 46 జిల్లాల్లో ఒక్క కొత్త కేసుకూడా నమోదు కాలేదు . లాక్ డౌన్ అమలుతో చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి . దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు .
మహారాష్ట్రలో 5 , గుజరాత్ 4 , రాజస్థాన్ , తమిళనాడు , మధ్యప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రెండేసి ఆస్పత్రులు , తెలంగాణ , కర్ణాటక , పంజాబ్ , చండీఘర్‌లో ఒక్కొక్క ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు . దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 5 , 231 రైల్వే కోలను కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చింది . దేశంలోని 215 గుర్తించిన రైల్వే స్టేషన్లలో ఈ కరోనా ట్రీట్మెంట్ కోలను ఉంచుతారు . కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించి , వారికి తక్కువ స్థాయిలో ప్రమాదం ఉందనుకున్న వారికి ఇక్కడ చికిత్స అందించనున్నారు .
2 Comments