ఫలించిన ప్లాస్మా థెరపీ, కరోనా అంతం ప్రారంభం, plasma therapy for coronavirus

కరోనాను అరికట్టేందుకు ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగప డుతుందని హస్తిన సీఎం కేజీవాల్ ప్రకటించారు. plasma therapy for coronavirus ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా థెరపీ చేస్తోందని , మరికొన్ని ప్రయోగాల అనంతరం వీటిని పెద్ద మొత్తంలో చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరనున్నట్టు తెలిపారు .

 అయితే ఈ సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కేజీవాల్ పిలుపునిచ్చారు . ఇదే వారి నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు .

 నలుగురు కరోనా రోగులకు plasma therapy for coronavirus థెరపీ చేశామని , సత్పలితాలు వచ్చాయన్నారు . కొన్ని రోజులుగా లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ ఆస్పత్రిలో ఈ ప్రయోగం చేస్తున్నట్టు ప్రకటించారు . ఇవి ప్రారంభ ఫలితాలు మాత్రమే అని , కరోనా వైరసకు విరుగుడు దొరికిందని ఎవరూ అనుకోవద్దని , ఇదొక చిన్న ఆశా కిరణమే అని స్పష్టం చేశారు .

ట్రీట్మెంట్ తీసుకున్న నలుగురిలో ఇద్దరు డిశ్చార్టీకి సిద్ధంగా ఉన్నారన్నారు . ఈ చికిత్సద్వారా కనీసం పది మంది కోలుకుంటేనే ఉత్తమ ఫలితంగా గుర్తిస్తామని తెలిపారు . ప్రస్తుతం మరో ఇద్దరు , ముగ్గురికి సరిపడా రక్తం , ప్లాస్మా సిద్ధంగా ఉందని వీటితో అత్యవసర చికిత్స పొందే బాధితులకు ప్లాస్మా థెరపీ చేస్తామని వైద్యాధికారులు వెల్లడించారు .

 ఈ ప్రయోగం ద్వారా సానుకూల ఫలితాలు రావడం ఊరట ఇస్తున్నాయని తెలిపారు .

 ప్లాస్మా చికిత్స అంటే . . ?

 ప్లాస్మా థెరపీలో కరోనాసోకినయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు . ఇలా

వేరు చేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితుడికి ఎక్కిస్తారు . కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్ పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి .

 అందుకే ఇలాంటి వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలోని యాంటీబాడీస్ వృద్ధి చెంది . వైరస్ పోరాడటంలో దోహదపడుతాయి . దీంతో అతడు ఈ వైరస్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . 

Related Articles

Back to top button