భారత్ లో 50వేల కరోనా కేసులు, COVID19 positive cases in India
భారత్ లో కరోనావైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతోంది. COVID19 positive cases in India గడిచిన 24 గంటల్లో 2 , 958 కేసులు నమోదుకాగా , 126 మంది కరోనాతో మృతిచెందారు . దీంతో దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 52 , 2478 చేరుకోగా , మృతుల సంఖ్య 1 , 766కు పెరిగింది .
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం . . . మహారాష్ట్రలో 617 మృతులు , 15 , 525 కేసుల తో మొదటి స్థానంలో నిలిచింది . మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు . గుజరాత్ లోనూ పరిస్థితి విషమంగానే ఉందన్నారు . గుజరాత్ లో కరోనావైరస్ తో 368 మృతి చెందగా , 6 , 245 కేసులు నమోదయ్యాయి .
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపె , గుజరాత్ డిప్యూటీ సీఎం , ఆరోగ్య మంత్రి నితిన్ భాయ్ పటేల్ తో కేంద్రమంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు . కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు . అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని , పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్కు తరలించడంతోపాటు , వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు .
COVID19 positive cases in India ::
దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య COVID19 positive cases in India కు పెరిగింది . ఇప్పటివరకు 14 వేలకు పైగా రోగులకు కూడా నయమైంది . ఇదిలా వుండగా , బుధవారం కర్ణాటక ప్రభుత్వం రూ . 1 , 610 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది . మరోవైపు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది . రోగుల వ్యక్తిగత సమాచారం ఆసుపత్రులులీక్ అయ్యే అవకాశం ఉందని దీనిపై కోర్టు కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు . అయితే , ఈ కేసులో తదుపరి విచారణను మే 11 వాయిదా వేసింది కోర్ట్ .
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో , గరిష్టంగా 1020 మందికి నయమైంది దాంతో రికవరీ రేటు 27 . 41శాతం పెరిగింది . ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది . ఆ మేర కుతాజాగా ఉత్తర్వులు జారీ చేసింది . ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది .
కర్ణాటకలో టీవీ సీరియల్ షూటింగ్లకు అనుమతి.
టెలివిజన్ సీరియల్స్ షూటింగ్ కు కర్నాటక సర్కార్ పచ్చజెండా ఊపింది . కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన కొన్ని సడలింపుల నేపథ్యంలో కన్నడ టెలివిజన సంఘం అధ్యక్షుడి సీఎం యెడియూరప్పను కలిసి షూటింగ్లకు అనుమతి కోరారు . సినీ కార్మికులు షూటింగ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆయన సీఎంకు వివరించారు . దీంతో సానుకూలంగా స్పందించి యాడి యూరప్ప కొన్ని నిబంధనలకు లోబడి టెలివిజ షూటింగ్లకు అనుమతిచ్చారు . షూటింగ్ సమయంలో కేవలం 12 మంది మాత్రమే ఉండాలనీ , ఎక్కువ మంది ఒక చోట గుమిగూడరాదని పేర్కొన్నారు . ఔట్ డోర్ షూటింగ్లకు అనుమతి లేదు . ఈ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ టెలివిజన్ షూటింగ్ జరుపుకోవాలన్నారు .
One Comment