గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీకి హైకోర్టు షాక్, High court order deposit of 50 crores
విశాఖపట్నం లో గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి సంఖ్య 12 కు చేరింది, High court order deposit of 50 crores దీన్ని సుమోటోగా స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎల్జి పోలిమర్స్ కంపెనీకి రూ . 50 కోట్లు కోర్టుకు జమ చేయండి అని ఆదేశించింది.
మరియు రాష్ట్ర ప్రభుత్వము జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. విశాఖలో చోటుచేసుకున్న ఎల్టీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీకేజీ నేపధ్యంలో ఆ సంస్థ యాజమాన్యం ముందు High court order deposit of 50 crores డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఆదేశించింది . జరిగిన ఘటన నేపద్యంలో జరిగిన ప్రాణ నష్టం అంచనా ఆధారంగా మధ్యంతరంగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని పేర్కొంది .
కేంద్ర ప్రభుత్వం , ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా , జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు ( సీపీసీబీ ) కూ నోటీసులు జారీ చేసిన ఎన్పీటీ సంఘటనపై తీవ్రంగా స్పందించింది . జస్టిస్ బి . శేష శయన రెడ్డి నేతృత్వంలో అయిదుగురు సభ్యులుతో కూడిన కమిటీని ఎన్పీటీ నియమించింది . ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18వ తేదీ లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది .
ఈమేరకు ఎఫైటీ చైర్‌పర్సన్ జస్టిస్ఆదర్శకుమార్ గోయల్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించింది . ఈ కమిటీ సభ్యులుగా ఏయూ మాజీ వీసీ వి . రామ చంద్రమూర్తి , కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య పులిపాటి కింగ్ , సపీసీబీ సభ్య కార్యదర్శి – సీఎఆర్ సంచాలకులూ , వైజాగ్ లోని నీరి హెడను నియమించారు . వీలైనంత త్వరగా ఘటన జరిగిన ప్రాంతాన్ని పాలిమర్స్ కంపెనీని వీరు సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు .
గ్యాస్ లీకేజ్ వల్ల వైజాగ్ లో భారీ ప్రమాదం…|| Gas leak in Vizag
ఈ మెయిల్ ద్వారా నివేదికను పంపాలని ఆదేశించారు . నిజనిర్ధారణ బృందానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలనూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అందించాలని సూచించింది . దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీపీసీబీ చైర్మన్‌కు సూచించారు .
ఘటనకు కారణాలు తెలుసుకోవడం , మరణించిన వారి సంఖ్యను , ఎంతమందిపై ఘటన ప్రభావం ఉంటుంది , పర్యావరణానికి ఎంతమేర విఘాతం ఏర్పడే అవకాశం ఉంది ? జీవరాశులకు జరిగిన నష్టం ఏమిటి ? అధికారుల పాత్ర ఎంత మేర ఉంది వంటి అంశాలపై దర్యాప్తు జరపాలని ఎన్వీటీ ఆదేశించింది . ఆన్ సైట్ , ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అవసరమని భావించిన ఎస్పీటీ నష్టం నివారణకు ప్రణాళికలనపై కూడా నివేదక ఇవ్వాలని కోరింది .