దేశంలో కరోనా విజృంభిస్తోంది, COVID19 cases tally in India

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి . గడిచిన 24 గంటల వ్యవధిలో 194 మంది ప్రాణాలు కోల్పోయారు . 3 , 875 మందికి సోకింది COVID19 cases tally in India మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 46 , 711 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది . వీరిలో 13 , 161 మంది కోలుకోగా , 1 , 583 మంది ప్రాణాలు కోల్పోయారు . 31 , 967 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు .

 కరోనా బాధితుల్లో రికవరీరేటు ప్రస్తుతం 27 . 41శాతంగా ఉంది . భౌతిక దూరం నిబంధనను సడలించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేకుంటే వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది . లాక్ డౌన్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాని స్పష్టం చేసింది .

COVID19 cases tally in India

 మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కలవరపెడుతోంది . ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 , 541 వైరస్ కేసులు నమోదు కాగా , 548 మంది ప్రాణాలు కోల్పోయారు . 2 , 115 మంది కోలుకున్నారు . ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది . నగరంలో ఇప్పటి వరకు 8 , 172 కేసులు నమోదవ్వగా , 322 మంది బలయారు .

 గుజరాత్ లో ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 5 , 804కి చేరగా , 290 మంది మరణించారు . 1 , 042 మంది డిశ్చార్జ్ అయ్యారు . మధ్యప్రదేశ్ లోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది . రాష్ట్రంలో 3 , 049 పాజిటీవ్ కేసులు నిర్ధారణ కాగా , 165మంది  మరణించారు . 198మంది డిశ్చార్‌ అయ్యారు . దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 4 , 898మందికి వైరస్ సోకగా 64 మంది మరణించారు . 1 , 362 మంది డిశ్చార్ అయ్యారు .

 రాజస్థాన్లో 3 , 061 మందికి వైరస్ సోకగా , అందులో 11మంది మృతి చెందారు . 1 , 356 మంది డిశ్చార్ అయ్యా రు . ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 2 , 859మందికి కరోనా సోకింది . అందులో 45 మంది మరణించారు . 758 మంది కోలుకున్నారు . తమిళనాడులో కొత్తగా 527 మందికి సోకింది . దీంతో కరోనా బాధితుల సంఖ్య 3 , 550కి చేరింది . అందులో 30 మంది మరణించారు . 1 , 379 మంది కోలుకున్నారు .

 కర్ణాటకలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 642కు చేరింది . అందులో నుంచి 304 మంది కోలుకున్నారు . 26మంది మరణించారు . పశ్చిమ బెంగాల్ లో మొత్తం కేసుల సంఖ్య 963కి చేరింది . అందులో 35 మంది మరణించారు . 151మంది డిశ్చార్ అయ్యారు . పంజాబ్లో పాజిటీవ్ కేసుల సంఖ్య 1451కి చేరింది . అందులో 117మంది కోలుకున్నారు .

Related Articles

Back to top button