లాక్ డౌన్ మళ్లీ పొడగింపా! Govt to extend lock down?

 కరోనాపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా పోరాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి . మురళీధర్ రావు అన్నారు. Govt to extend lock down? అవకాశం ఉంది అన్నారు.

వైరస్ పై జరుగుతున్న పోరుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు , అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరిస్తున్నారన్నారు . దేశంలో మరో ఏడాది వరకు బహిరంగసభలు ఉండకపోవచ్చునని , జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందన్నారు .

 మే 3 తర్వాత లా డౌన్ ఎత్తేస్తారో లేదో Govt to extend lock down? చెప్పలేమన్నారు . స్కూళ్ళు , కళాశాలలు జూన్ తర్వాత నడిపించడంపై చర్చలు సాగుతున్నాయన్నారు . కేంద్ర ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుంటుందని , అప్పటివరకు ఉన్న క్లాస్ రూం విధానం ఇక నుంచి ఉండకపోవచ్చునని అన్నారు .

 CoVID19 అనూహ్యంగా విస్తరించిందని , ఫలితంగా తొలుత కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు  క్రమక్రమం గా పరీక్షల ల్యాబు , కిట్లు , వైద్య పరికరాలను సమకూర్చుకోవడంలాంటిని చేస్తున్నామన్నారు .

 కరోనా పరీక్షలకు మొదట్లో పూణేలోని ఒక్క ల్యాబ్ మాత్రమే ఉండగా , ఇప్పుడు అన్ని ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . కరోనాపై పోరులో వైద్యుల పాత్ర మరువలేనిదని , వారికి ప్రభుత్వం అన్నిరకాల అండదండగా నిలుస్తుందన్నారు .

  వైరస్ విస్తరణ తగ్గినప్పటికీ మానవ జీవన విధానంలో చెప్పుకోతగ్గ మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు . పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరగనుందన్నారు . లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాలపై ప్రభావం పడిందని , ఆర్థిక క్రమశిక్షణ మరింత తప్పనిసరి కానుందని అభిప్రాయపడ్డారు .

Related Articles

Back to top button