భారత్ పై పంజా విసురుతున్నా కరోనా, spike in COVID19 cases in India
భారత్ లో కరోనా వైరస్ కోరలు చేస్తుంది. spike in COVID19 cases in India ఇపుడు నమోదవుతున్న కేసుల ప్రకారం భారత్ కరోనా వైరస్ కేసుల్లో చైనను దాటే అవకాశలు కనిపిస్తున్నాయి. దేశ రాజదాని తో పాటు మహారాష్ట్ర గుజరాత్ తమిళ్ నాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.
spike in COVID19 cases in India ::
ఢిల్లీలో ఒక్క రోజులో 472 కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో 5,310 క్రియాశీల కేసులతో ఢిల్లీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య 8,470 కు పెరిగింది . ఆరోగ్య శాఖ అధి కారుల నివేదిక ప్రకారం ఢిల్లీలో మొత్తం కోవిడ్ 19 కారణంగా మరణించినవారి సంఖ్య 115 కు చేరుకుంది . గత 24 గంటల్లో 187 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది . గురువారం ఒక్కరోజు 472 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు . ఢిల్లీలో ఇప్పటివరకు 3,045 మంది బాధితులు క రోనా వైరస్ నుంచి కోలుకున్నారని 5,310 కేసులు యాక్టివ్ గా ఉన్నా యని ఆరోగ్యశాఖ వివరించింది . మరణించిన 115 మందిలో 100 మందికి ఇతర తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు .
మొత్తం మరణాల్లో 22 మంది మాత్రమే 50 సంవత్సరాల కంటే తక్కువ వయసువారు ఉన్నారని తెలిపారు . కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 1,19,736 పరీక్షలు జరిగాయి . దేశరాజధానిలో కంటైన్మెంట్ జోన్లు 78 కు పడిపోయాయని ఆరోగ్యశాఖ నివేదికలో తెలిపింది .
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బస్సులు ఢిల్లీలో 18 వ తేదీ సోమవారం నుంచి బస్సులు నడుస్తాయి అని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ తెలిపారు . ప్రజారవాణాలో ప్రయాణికులు తప్పకుండా మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా నిబంధనలు విధించినట్లు తెలిపారు . వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు .
మెట్రో రైలు నడిపడానికి చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు సీఎం కేజీవాల్ తెలిపారు . గురువారంనాడిక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు . లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఢిల్లీ ప్రజల నుంచి దాదాపు 5 లక్షలకు పైబడి సలహాలు , సూచనలు వచ్చినట్లు సీఎం తెలిపారు . ఇందులో ప్రధానంగా మాస్క్ ధరించడం , భౌతిక దూరం పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచనలు వచ్చినట్లు వివరించారు . మార్కెట్లు , షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలని కొన్ని అసోసి – యషన్లు విజ్ఞప్తి చేశాయని కేజీవాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు . దుకాణాలను సరి , బేసి విధానంలో తెరిస్తే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చినట్లు తెలిపారు . ఇప్పటి వరకు 4 , 76,000 వాట్సాప్ మెసే జెస్ , 10,700 ఈ మెయిల్స్ , 39 వేల కాల్స్ ద్వారా సలహాలు , సూచనలు వచ్చినట్లు సీఎం అరవింద్ కేజీవాల్ తెలిపారు .
One Comment