రాష్ట్రంలో 320కి చేరుకున్న కరోనా కేసులు, 320 coronavirus cases in Telangana
తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు తో పరిగిలో 144 సెక్షన్ విధింపు, భయాందోళనలో ప్రజలు, 320 coronavirus cases in Telangana రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగు తుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
ఆదివారం సాయంత్రానికి 320 coronavirus cases in Telangana 326పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రచారం సాగుతోంది . ఆదివారం కూడా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి .
ఆదిలాబాద్ జిల్లాలో కొందరు కరోనా వైరసకు భయపడి ఊరిని ఖాళీ చేసి పొలాలకు వెళ్లి షెల్టర్స్ ను ఏర్పాటు చేసుకున్నారు . పరిగి పట్టణంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వట్టణంలో 144 సెక్షన్‌ను విధించాల్సి వచ్చింది.
కరోనా బాధితులకు తాము వైద్య సేవలను చేయలేమంటూ కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వనిచేస్తున్న ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు . మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి . దీంతో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడం వారిని కరోనా వరీక్షల కోసం క్వారంటైన్ కేంద్రాలకు తీసుకు రావడంతోపాటు పాజిటివ్ గా నమోదైన వారికి చికిత్సలను అందిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, శనివారం ఒక్కరోజే 10మందికి కరోనా పాజిటివ్ గా తేలింది . అందులో ఒక్క నేరడికొండ మండల కేంద్రంలోనే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్ కేసులునమోదైన మధురానగర్ చుట్టువక్కల నివాసం ఉండే 100 నుంచి 150 కుటుంబాల వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి తమ వంటపొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకొని అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు . పరిగి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో పట్టణం నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
పాజిటివ్ కేను నమోదైన వ్యక్తి సుమారు 40 మందిని కలిసినట్టు గుర్తించిన అధికారులు అతను ఎక్కడెక్కడ తిరిగాడు ,ఎవరెవర్నీ కలిశాడన్న సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులకు వైద్యులు , వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి చికిత్సలను అందిస్తున్నారు . అయితే కామారెడ్డి జిల్లా ఆసువత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆరుగురు వైద్యులు తాము కరోనా బాధితులకు వైద్య సేవలు అందించలేమని పేర్కొంటూ రాజీనామా లేఖలు అందించారు.
వారితో జిల్లా వైద్యాధికారులు చర్చలు జరుపుతున్నారు . తమ కుటుంబ సభ్యులు తాము కరోనా బాధితులకు వైద్య సేవలు చేయడంలో ఆందోళన చెందుతూ తమను విధులకు హాజరుకావొద్దని ఒత్తిడి తెస్తున్నా రని వైద్యులు పేర్కొన్నారు .
3 Comments