దేశ ప్రధానికి సోకిన కరోనా, ICU కీ తరలింపు, Britain PM tests positive

 కరోనా వైరస్ సోకి పది రోజులు గా బాధపడుతున్న Britain PM tests positive బోరిస్ జాన్సన్ ( 55 ) ను ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు . పరీక్షల నిమిత్తం ఆయనను లండన్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలవారు తెలియజేరు.

 అయినప్పటికీ అధికారపగ్గాలు ఆయన చేతుల్లోనే ఉంటాయని తెలిపారు . మార్చి 27వ తేదీననే Britain PM tests positive బోరిస్ జాన్సను కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది . అప్పటి నుంచి ఆయన తన అధికారిక గహంలో స్వచ్చందంగా క్వారంటైన్ లో ఉంటున్నారు . అయితే జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు .

 ఆయనకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నదని వైద్యులు తెలియజేశారు . అయితే ఏ పరీక్షలు నిర్వహిస్తారన్నది తెలియజేయలేదు . కాకపోతే  ఆక్సిజన్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి , ఉపిరితిత్తులు , లివర్ , గుండె పనితీరు ఎలా ఉన్నది తెలుసుకోవడానికి పరీక్షలు జరపవచ్చునని అంటున్నారు.

 వైద్యులు వ్యక్తిగతంగా పరీక్షించేందుకు వీలుగా ఆయను ఆసుపత్రికి తరలించినట్లు మరో అధికారి తెలిపారు . ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని హౌసింగ్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ తెలియజేశారు . త్వరలోనే ఆయన తిరిగి తన విధులకు హాజరుకాగలరని భావిస్తున్నట్లు చెప్పారు .

 అయితే  ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో కోవిడ్ – 19 జరగాల్సిన ఉన్నతస్థాయి సమీక్షా సమాశానికి విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ అధ్యక్షత వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి . ప్రధానిని ఆసుపత్రిలో చేర్పించినట్లు బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు తెలియజేశారు .

 బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ సందేశాన్ని పంపించారు . కరోనా విషయంలో మొదట్లో బోరిస్ కూడా ఉదాసీనంగానే వ్యవహరించారు . కరోనా రోగులకు తాను షేక్ హ్యాండ్ ఇస్తున్నానంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు . దీంతో ఆయన తీరుపై దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి . ఇలాగే వ్యవహరిస్తే దేశంలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 50 లక్షలు దాటుతుందంటూ వైద్యనిపుణులు హెచ్చరించడంతో ట్రాక్ మార్చారు .

 దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు . అప్పటికే వైరస్ ఆయన కేబినెట్ లోకి ప్రవేశించింది . ఆరోగ్య మంత్రి , చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరులకు కరోనా పాజిటివ్ వచ్చింది . ఆయన భార్యకు కూడా పాజిటివ్ వచ్చినా తాను కోలుకుంటున్నట్లు ఆమె ఓ ప్రకటన తెలిపారు .

Related Articles

Back to top button