తెలంగాణలో 154 కు చేరిన కరోనా వైరస్ కేసులు, 154 coronavirus cases in TS

తెలంగాణలో 154 coronavirus cases in TS పరిస్థితి పై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు . కరోనా నివారణ చర్యలు , లాక్ డౌన్ అమలుపై అధికారులతో సిఎం చర్చించారు . వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , సిఎస్ సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

 దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు , లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ గురువారంనాడు ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే .

 ఈ విషయంపై సిఎం కెసిఆర్ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు . మర్కజ్ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రధానికి వివరంగా చెప్పారని సమాచారం . ఇదిలా ఉండగా , రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని , దీనికి ప్రజలు కూడా సహకరించాలని సిఎం కెసిఆర్ పిలుపు నిచ్చారు.

154 కు చేరిన కరోనా వైరస్ కేసులు::

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూవుతోంది . గురువారం ఒక్క రోజే 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . సంగారెడ్డిలో ఏకంగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . నల్గొండ , జనగామ జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిలో 17మంది డిశ్చార్జ్ అయ్యారు . కరోనా వైరతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు . రాష్ట్రంలో గురువారానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 154 coronavirus cases in TS నమోదయ్యాయి . వాటిలో 17 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు . మరో 9 మంది మరణించగా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 128గా కొనసాగుతున్నాయి.

 పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పట్టణాలతోపాటు కొత్తగా గ్రామాల్లోనూ నమోదు అవుతున్నాయి . సంగారెడ్డి జిల్లాలో పాజిటివ్ వచ్చిన కేసుల్లో వాటిలో రెండు సంగారెడ్డి పట్టణంలో నమోదు కాగా అంగడిపేట గ్రామంలో ఇద్దరికి , కొండాపూర్ , జహీరాబాద్ మండలాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ గా వచ్చాయి .

ఆలాగే నల్గొండ జిల్లా మాండ్ర గ్రామంలోనూ ఒక వ్యక్తికి కరోనా కేసునమోదయింది . ములుగు జిల్లాలోనూ ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలింది . ఏటూరునాగారం , పస్రాకు చెందిన ఇద్దరికీ కరోనా జపాజిటివ్ అని తేలిందని కలెక్టర్ ప్రకటించారు.

 ఇప్పటికే జనగామ జిల్లాలోన వెల్దండ గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని అధికారులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే . ఇలా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పట్టణాలకే వరిమితం కాకుండా గ్రామాలకు కూడా వ్యాపించడంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.

 రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలను చేయాలని నిర్ణయించారు . అయితే కొన్నిచోట్ల స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవడానికి ఇష్టపడకుండా  నిర్వహించడానికి వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.

 నిజామాబాద్ జిల్లాలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్లిన ఆశావర్కర్లు , వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడిచేశారు . గత మూడు , నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వాటిలో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ నమావేశాలకు వెళ్లి వచ్చినవారు ఉండటంతో వారికిసంబంధించిన కుటుంబ సభ్యులతోపాటు వారు సంచ రించిన ప్రాంతాల్లో వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా అధికారులు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరిలిస్తున్నారు .

Related Articles

Back to top button