AP లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, Coronavirus cases in AP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉంటున్నాయి . Coronavirus cases in AP శనివారం 26 కొత్త కేసులు నమోదయ్యాయి . దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 194కు చేరుకుంది .

  శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం వరకు కొత్తగా 16 కేసులు నమోదు కాగా శనివారం ఉదయం 10 నుంచి మరో 14 కేసులు నిర్ధారణఅయ్యాయి .

 తాజాగా నమోదైన మొత్తం 30 కేసుల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో తొమ్మిది కేసులు నిర్ధారణఅయ్యాయి . గుంటూరులో 6 , ప్రకాశంలో రెండు కేసులు , కర్నూలులో 3 , కడప లో 4 , చిత్తూరులో ఒక కేసు , అనంతపురలో ఒక కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి .

 Coronavirus cases in AP రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 194 పాజిటీవ్ కరోనా కేసుల్లో నెల్లూరు , కృష్ణాజిల్లాల్లో 32 కేసుల చొప్పున రిపోర్టు అయ్యాయి . గుంటూరులో 26 , కడప లో 23 , ప్రకాశంలో 19 , విశాఖలో 15 , పశ్చిమగోదావరిలో 15 , తూర్పు గోదావరిలో 11 , కర్నూలులో 4 , అనంతపురంలో 3 కేసుల చొప్పున నమోదయ్యాయి .

 పది శాతం నమూనాలకు పాజిటీవ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా  నిర్వహిస్తున్న కోవిడ్ – 19 డాష్ బోర్డు ప్రకారం ( శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో మొత్తం 1800లమంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించారు . వీటిలో పదిశాతం నమూనాలకు పాజిటీవ్ గా నిర్ధారణ అయింది . మరో 1175 నమూనాలకు ( 65శాతం ) సంబంధించి నెగిటీవ్ రిపోర్టు వచ్చింది . ఇంకా 445 ( 24 .7 శాతం ) ఫలితాలు వెల్లడికావల్సి ఉంది .

Related Articles

Back to top button