తెలంగాణలో కరోనా విజృంభణ,మొత్తం 272 కేసులు, coronavirus cases in TS

తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొరలు చాస్తోంది . గత రెండు మూడు రోజులుగా coronavirus cases in TS సంఖ్య మితిమీరి పెరు గుతోంది . తెలంగాణలో నిన్నటి వరకు 229గా ఉన్న కరోనా కేసులు శనివారం నాటికి 272కు చేరుకున్నాయి.

 ఒకే రోజు 48 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది . ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించింది . వీరిలో కరీంనగర్ , ఆదిలాబాద్ , వరంగల్ , నల్గొండ జిల్లాల్లో శనివారం కొత్త కేసులు వెలుగుచూశాయి.

 వీరంతా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారేనని అనధికా వర్గాలు వెల్లడించాయి . మొన్నటి వరకు రాష్ట్రంలో తీవ్రత తగ్గిన కరోనాతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్న సందర్భంలో మర్కజ్ యాత్రికుల రాకతో అన్ని జిల్లాల్లో భయానక వాతావరణం నెలకొంది .

 దాదాపు 38 జిల్లాల్లో నూ కరోనా కేసులు నమోదయ్యాయి . నిజామాబాద్లో ఒకరు కరోనా అనుమానిత రోగి మృతి చెందడం తప్ప శనివారం మరణాలు సంభవించలేదు . డిశ్చార్జి అయినవారు మినహా మిగతా వారందరికీ వైద్య సేవలు కొనసాగుతున్నాయని , వారంతా ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

 క్వారంటైన్ కేంద్రాల నుంచి గాంధీకి ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న అనుమానితుల ఆరోగ్యం విషమించడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు . ఈ పరిణామాలతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు . శనివారం జగిత్యాల , ఆదిలాబాద్ జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన కరోనా బాధితులను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 ప్రతిగంటకు కొత్త coronavirus cases in TS నమోదు కావడం వైద్య ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది . గడిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే 147 కేసులు నమోదు కావడం గమనార్హం .

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా సోకిన రోగుల సంఖ్య 25కు చేరింది . జగిత్యాల జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ జీ . రవి తెలిపారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 19కు చేరింది . ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు 10కి చేరినట్లు ఆ జిల్లా వైద్యాధికారి తెలిపారు.

 ఇతర రాష్ట్రాలతో పోలి స్త్ కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య తెలంగాణలోనే ఎక్కువగా ఉంది . తమిళనాడులో 411కు ఇద్దరు , ఢిల్లీలో 386 కేసుల్లో ఆరుగురు , కేరళలో 295 పాజిటివ్ కేసుల్లో ఇద్దరు మృతి , తెలంగాణలో 229 కేసులకు 11మంది , రాజస్థాన్లో 200 కేసులకు నలుగురు , ఉత్తరప్రదేశ్ 231 కేసుల్లో ఇద్దరు , ఏపీలో 180 కేసులకు ఒకరు , మధ్యప్రదేశ్ లో 154 కేసులకు 9మంది , కర్ణాటకలో 128 కేసులకు నలుగురు , గుజరాత్ లో 105 కేసులకు 10మంది , జమ్మూ కశ్మీర్‌లో 92 కేసులకు ఇద్దరు , పశ్చిమబెంగాల్ లో 57 కేసులకు ఏడుగురు , పంజాబ్ లో 57 కేసులకు అయిదుగురు మృతిచెందారు . మరోవైపు కరోనా కట్టడికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు .

Related Articles

Back to top button