మోడీ చెప్పినట్టు దీపాలు ఎందుకు వెలిగించాలో తెలుసుకోండి, PM Modi message to all people
కరోనాపై జరుగుతున్న పోరులో దేశ ప్రజలందరూ మరోసారి భాగస్వాములు కావాలని, PM Modi message to all people అంధకారం నుంచి కరోనా వైరసన్ను ప్రజలు వెలిగించే దీపాలకాంతితో పారద్రోలాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసారు.
శనివారం దేశ ప్రజలకు ఆయన తన ట్విట్టర్లో సందేశం ఇస్తూ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దేశవ్యాప్తంగా దీపాలు , లేదా కొవ్వొత్తులు వెలించాలని సూచించారు . రండి దీవం వెలిగించండి అంటూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పిన ప్యాన్ని మోడీ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ఆదివారం రాత్రి తొమ్మిది గంటలనుంచి తొమ్మిది నిమి షాలపాటు ఇంట్లోని అన్ని లైట్లను ఆర్పివేసి దీపం లేదా కొవ్వొత్తులు మొబైల్ ఫ్లాష్ లైట్లు , టార్చిలైట్లు వెలిగించాలని మోడీ సూచించారు . ఇలాచేయడం వల్ల కాంతికి ఉన్న సమున్నత శక్తిని ప్రదర్శించాలని , మనం ఉమ్మడి గా లక్ష్యాన్ని సాధించేదిశగా యావత్ భరత జాతి ముందుకు నడుస్తు న్నదన్న సందేశం ఇవ్వాలని ఆయన కోరారు.
మన లో ఎవ్వరూ ఒంటరి కాదని , 130 కోట్లమంది భారతీయులు ఉమ్మడి లక్ష్యసాధనకోసం అంకితమై ఉన్నారని , ఆ దీవం కాంతులు వెలుగులో నిరూపించాలని PM Modi message to all people యావత్ ప్రజలను కోరుతూ ట్వీట్ చేసారు.
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిదినిమిషాలపాటు విద్యుత్ లైట్లు ఆర్పి వేయాలన్న ప్రతిపాదనపై ఎలాంటి వోల్టేజి హెచ్చుతగ్గులుండవని విద్యుత్ శాఖ స్పష్టంచేసింది .
కరోనావైరస్ వంటి అంథకారాన్ని పారద్రోలేందుకు దీపాలను వెలిగించి ఆవెలుతురుతో వైరస్ మహమ్మారిని తరిమికొట్టగలమన్న సంకేతం ఇచ్చేందుకు వీలుగా ప్రధాని ఇచ్చిన పిలువునకు పవర్ గ్రిడ్ పై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కొందరు వ్యక్తంచేసారు.
పవర్ గ్రిడ్ లో అస్తిరత్వం నెలకొంటుందని , వోల్టేజి హెచ్చుతగ్గులు ఉంటాయన్న వాదనను తెలిపారు . దీనివల్ల విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటాయని అన్నారు . అయితే ఇవన్నీ అపోహలు మాత్రమేనని అన్నారు . భారత్ విద్యుత్ గ్రిడ్ పటిష్టంగా ఉందని ఇందుకు సంబంధించి డిమాండ్లో వచ్చే తేడాలను పర్యవేక్షించేందుకు సమర్థవంతమైన ఏర్పాట్లు చేసామని విద్యుత్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ప్రధాన మంత్రి విజ్ఞప్తిని అనుసరించి ఆదివారం రాత్రి తొమ్మిదినుంచి 9 .09 గంటలవరకూ ప్రజలు తమ ఇళ్లలో మొత్తం లైట్లను ఆర్పివేయాలని సూచించారు .
One Comment