రాష్ట్రంలో 404 కు చేరిన కరోనా కేసులు, 404 positive cases in Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి . వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు మొత్తం 404 positive cases in Telangana కేసులు పాజిటీవ్ వచ్చినట్లుగా మంగళవారం రాత్రి విడుదలైన హెల్త్ బులిటెన్ తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలో 348 యాక్టీవ్ పాజిటీవ్ కేసులు ఉన్నాయి . ఇప్పటి వరకు 11 మంది మరణించగా , 45 మంది కరోనా నయమై డిశ్చార్జ్ ఆయ్యారు . తెలంగాణలో మంగళవారం ఒక్క రోజే 40 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి.
404 positive cases in Telangana , హైదరాబాద్ లో 171 పాజిటీవ్ కేసులు నమోదు కాగా , 21 మంది డిశ్చార్జ్ అయ్యారు . మొత్తం 25 జిల్లాల్లోనే కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . మహబూబ్ నగర్ లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటీవ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
మర్కజ్ వెళ్లాచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గురికి కరోనా వచ్చిందని వెల్లడించారు . దీంతో నగరంలోని బికె రెడ్డి కాలనీ , మర్లు ప్రాంతాల్లో అధికారులు ఆప్రమత్తమయ్యారు . ఈ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు . ఈ ప్రాంతాల్లో ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ ప్రాంతాల్లో రసాయనాలు పిచికారి చేశామని , పాజిటీవ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారని గుర్తిస్తున్నామని , ఇప్పటి వరకు గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన తెలిపారు .
జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . వీటిలో 7 కేసులు గద్వాల టౌన్లో , మరో రెండు కేసులు రాజోలు మండల కేంద్రం నుంచి నమోదయ్యాయి .
గద్వాల వట్టణంలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ నర్వేలు నిర్వహిస్తున్నారు . గద్వాల మున్సిపల్ సిబ్బంది కాలనీల్లో సానిటేషన్ పనులను ముమ్మరం చేశారు . మర్కజీకు వెళ్లి వచ్చిన రిమ్స్ కంటి వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు, ఆదిలాబాద్ జిల్లాలో ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల సన్నాహక సమావేశానికి హాజరై విషయాన్ని గోప్యంగా ఉంచిన రిమ్స్ కంటి వైద్యుడిపై కేసు నమోదైంది .
రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వైద్యునిపై ఎపిడెమిక్ డిసీస్ , డిజా స్టర్ మేనేజ్ మెంట్ సెక్షన 176 , 188 , 270 , 271 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా మర్కజ్ ప్రార్థనలకు హాజరై సమాచారం ఇవ్వని వారు ఉంటే స్థానిక ప్రజలు పోలీసులకు , 104 , 100 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలని జిల్లా ఎస్పీ విజృప్తి చేశారు .
బాధితులు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు .