777,77,77,777 కు చేరుకున్న ప్రపంచ జనాభా, world population in 2020

world population in 2020 జనాభా బుధవారం నాటికి 777 ,77 ,77 ,777 దాటింది . మరో మూడేళ్ళలో జనాభా 800 కోట్లు దాటిపోనుంది . గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనాభా పెరుగుదలలో కొంత తగ్గుదల నమోదౌతోంది . ఈ ఏడాది చివరికి 1 . 05 శాతం పెరుగుదల ఉంటుందని అంచనాలేస్తునారు .

 గతే డాది 1.08శాతంగా నమోదైంది . ఈ ఏడాది కొత్తగా 8,13 ,30 ,639 మంది world population in 2020 పెరుగుతారన్నది అంచనా . ఈ ఏడాది చివరికి మొత్తం జనాభాలో 56శాతం పట్టణాలు , నగరాల్లోనే జీవిస్తారు.

 ప్రపంచ జనాభా 777,77 ,77,777 చేరేసరికి చైనా జనాభా 143,81 ,69 ,019గా ఉంది . అదే సమయానికి భారత జనాభా 137,71 ,66 ,004గా నమోదైంది . ఈ రెండు దేశాలు జనాభాపరంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా తొలి 20 దేశాల జనాభా నమోదు ఈ విధంగా ఉంది .

  •  అమెరికాలో 33 , 05 , 98 , 908
  •  ఇండోనేసియాలో 27 , 29 , 18 , 641 
  •  పాకిస్తాన్లో 21 , 99 , 85 , 803 
  •  బ్రెజిల్ లో 21 , 22 , 44 , 664 
  •  నైజీరియాలో 20 , 50 , 53 , 776 
  •  బంగ్లాదేశ్ లో 16 , 43 , 46 , 444 
  •  రష్యాలో 14 , 59 , 21 , 529 
  •  మెక్సికోలో 12 , 86 . 49 , 441 
  •  జపాన్లో 12 , 65 , 56 , p155 
  •  ఇథియోపియాలో 11 , 43 , 57 , 859 
  •  ఫిలిప్పీన్స్లో 10 , 92 , 75 , 035 
  •  ఈజిప్టో 10 , 19 , 26 , 737 
  •  వియత్నాంలో  9,71 , 55 , 738 
  •  కాంగోలో 8 , 89 , 78 , 240 
  •  టర్కీలో 8 , 41 , 49 , 208 
  •  జర్ననీలో  8 , 37 , 28 , 392 
  •  ఇరాన్లో 8 , 37 , 67 , 500 
  •  థాయ్ ల్యాండ్ లో 6 , 97 , 63 , 69

 ప్రపంచ వ్యాప్తంగా పట్టణ , నగరీకరణ అనూహ్యంగా పెరిగింది . గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో పట్టణాలకు వలసలు నెలకొన్నాయి . 2011 అక్టోబర్ 31న ఏడొందల కోట్లను దాటేసింది . 2020 ఏప్రిల్ లోనే 780 కోట్ల సంఖ్యను కూడా అధిగమించనుంది . 2023లో 800కోట్ల సంఖ్యను దాటుతుందని అంచనా .

 2037లో 900 కోట్లు , 2057లో వెయ్యికోట్లకు జనాభా చేరుతుందని అంచనాలేస్తున్నారు . ప్రపంచ జనాభా 777 , 77 , 77 , 777లకు చేరేసరికి ఆసియా ఖండం జనాభా 464 , 10 , 54 , 775గా నమోదైంది . ఆఫ్రికా ఖండ జనాభా 134 , 05 , 98 , 147గా ఉంటే ఐరోపా జనాభా 74 , 76 , 36 , 026 , లాటిన్ అమెరికా , కరిబేయన్ జనాభా 65 , 39 , 62 , 331 , ఉత్తర అమెరికా జనాభా 36 , 88 , 69 , 647 , ఓషియానా జనాభా 4 , 26 , 77 , 818గా నమోదైంది .

Related Articles

Back to top button