మర్కజ్ కు వెళ్ళిన వారిలో 160 మంది దొరకలేదు, Govt to find 160 people
కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. Govt to find 160 people అన్ని రాష్ట్రల కంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్రమేనని ఆయన వ్యాఖ్యానించారు .
కరొన వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన తెలిపారు . కరోనా వైరస్ పరిస్థితులపై ఆయన బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు . కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని శాఖల అధికారులు , సిబ్బంది నియంత్రణ చర్యలను వేగంగా చేపడుతున్నారన్నారు.
విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని మొదట కోరింది సిఎం కెసిఆర్ అని మంత్రి తెలిపారు . మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం ఇచ్చింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు . ఇప్పటి వరకు మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో 160 మంది తప్ప Govt to find 160 people , మిగతా వారందరినీ గుర్తించి టెస్టులు చేస్తున్నామని తెలిపారు.
మరజ్ ప్రార్ధనల్లో ప్రత్యక్షంగా కలసిన వ్యక్తులను కూడా క్వారంటైన్ చేసినట్లు మంత్రి వెల్లడించారు . కేవలం రెండు రోజుల్లోనే Govt to find 160 people మందిని గుర్తించి , పరీక్షలు చేస్తున్నామంటే , ప్రభుత్వం సత్తా , చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలన్నారు .
రాష్ట్రంలో ఇప్పటి వరకు కమ్యూనిటి ట్రాన్స్మిషన్ జరగలేదని , రాబోయే రోజుల్లో కూడా జరగకూడదని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు . గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగటివ్ వచ్చిందని , మరోసారి పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఇద్దరు వ్యక్తులను డిశ్చార్జ్ చేస్తున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు . డిశ్చార్జ్ అయిన వారిని కూడా మరో 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండేటట్లు సూచిస్తున్నామని మంత్రి అన్నారు . ఇప్పటి వరకు తెలంగాణలో 6 గురు వ్యక్తులు కరోనాతో చనిపోయారని , వీరంతా ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వారేనని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో క్వారంటైన్లో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు జీపిఎస్ పద్దతిని వాడుతున్నామని మంత్రి ఈటల తెలిపారు . ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది క్వారంటైన్లో ఉన్నారని , వాళ్లు బయటకు తిరగకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని , ఒకవేళ బయటకు వస్తే లోకేషన్ ఆదారంగా గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వ బడుతుందని మంత్రి ట్వీట్ చేశారు . కొవిడ్ 19 మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగు తుందని చెప్పారు .