ప్రధానిని కూడా వదలని కరోనా వైరస్, UK prime minister tests +ve

 కరోనా వైరస్ ఎవరికీ అతీతం కాదని మరోసారి స్పష్టమైంది . దేశాధినేతలనూ కరోనా వణికిస్తోంది . తాజాగా UK prime minister tests +ve బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సను నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది . బోరిస్ జాన్సన్ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారని కార్యాలయం వెల్లడించింది .

 జాన్సన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారని , కరోనాను బ్రిటన్ ఎదుర్కొనే చర్యలను నిరతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది . ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా అని , సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోరిస్ వెల్లడించారు .

 వైరసీపై సమిష్టిగా పోరాడుదామని పిలుపు నిచ్చారు . 24 గంటలుగా తాను కరోనా లక్షణాలతో బాధపడినట్టు బోరిస్ వివరించారు . తాత్కాలిక ప్రధానిగా డొమినిక్ కొనసాగే అవకాశం ఉంది.

 బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఇంగ్లండ్ ప్రధాన వైద్యాధికారి , ప్రొఫెసర్ క్రిస్ విట్టి సలహా మేరకు ప్రధాని పరీక్ష చేయించుకున్నారని తెలిపారు . ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించిన పరీక్షలో UK prime minister tests +ve పాజిటివ్ వచ్చిందని , మార్గదర్శకాల మేరకు ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని వివరించారు . 

55 ఏళ్ల బోరిస్ విశ్రాంతి తీసుకుంటే, డొమినిక్ రాబ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది . ప్రస్తుతం ఆయన భాగస్వామి కారీ సైమండ్స్ గర్బిణి . ఉదయం బోరిస్ . ఆరోగ్య కార్యదర్శి , తన కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు . ఇప్పుడు వీరు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది . ఇప్పటికే జర్మనీ ఛాన్సర్ ఎంజెలా మెర్కెల్ స్వీయ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే . కరోనా వైరస్ కు ఎవరు అతీతం కాదు అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.

Related Articles

Back to top button