రాష్ట్రంలో ఆగని కరోనా, Ts COVID19 positive cases

తెలంగాణలో  కరోనాతో గురువారం ఒక రోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు . దీంతో ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 45 కు చేరింది . Ts COVID19 positive cases కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 26 జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన బులెటెన్ లో పేర్కొన్నది .

 తాజాగా 10 మంది వలస కూలీలకు వైరస్ సోకినట్లు తెలిపింది . కొత్తగా నమోదైన 38 కేసులతో ఇప్పటి దాక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1699 కి చేరింది . గురువారం 23 మంది డిశ్చార్జీ కాగా ఇప్పటి దాక ఆసుపత్రిలో చికిత్స పొంది కొలుకోని ఇంటికి వెళ్లిన వారిన సంఖ్య 1036 అని తెలిపింది . కొత్తగా 10 మంది వలుస కూలీలను కలుపుకుని ఇప్పటి దాకా రాష్ట్రంలో 99 మంది వలస కూలీలకు కరోనా సోకిందని స్పష్టం చేసింది .

Ts COVID19 positive cases ::

 కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 618 గా ఉంది . వరంగల్ రూరల్ , యాదాద్రి  భువనగిరి , వనపర్తి జిల్లాల్లో ఇంత వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడ నమోదు కాలేదు . కూకట్పల్లి జోన్లో గురువారం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . పాతబస్తీలోని ఈదీ బజారులో నలుగురికి కరోనా సోకినట్లు నిర్ధారించారు . మోతినగర్ లో ఇద్దరికి కరోనా సోకగా కొరియో గ్రాఫర్ , టీ స్టాల్ నిర్వహకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు . బషీర్ బాగ్ అవంతినగర్ లో నివాసం ఉంటున్న ఓ కాంట్రాక్టర్‌కు కరోనా సోకడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది . కరోనా మహమ్మారితో చనిపోయిన వారి సంఖ్య అంతకంతక పెరుగుతోంది .

Related Articles

Back to top button