తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం, Road Accident in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి తాజాగా Road Accident in Telangana ఆగి ఉన్న లారీని కారు  ఢీకొట్టి  ముగురు దుర్మరణ  పాలయ్యారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యియ. నల్లగొండ జిల్లా , చిట్యాల పట్టణ శివారులోని రిల యన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారి 65 పై ఆగి ఉన్న ధాన్యపు లారీని గురువారం తెల్లవారుజామున కారు ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .

 ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డరు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా , రాజమండ్రి నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఎర్టీగా కారులో డ్రైవర్ దయ్యాల రాంబాబు , ఆయన తల్లి లక్ష్మీ , ముగ్గురు పిల్లలతో పాటు కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు గీసాల శ్రీనివాస్ ( 48 ) , భార్య గీసాల లక్ష్మీ ( 40 ) , కండెంపల్లి లక్ష్మీ చందన ( 18 ) లతో కలిసి గురువారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ కు బయల్దేరు . Road Accident in Telangana చిట్యాల పట్టణ శివారుకు రాగానే జాతీయ రహదారిపై ఆగివున్న ధాన్యపు లారీని వెనుకనుంచి కారు అతివేగంగా ఢీకొట్టింది . దీంతో కారులో ప్రయాణిస్తున్న గీసాల శ్రీనివాస్ , అతని భార్య లక్ష్మీ , కండెంపల్లి లక్ష్మీచందనలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు . డ్రైవర్ , అతని తల్లి తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు .

 ఈ ప్రమాదం నుంచి ముగురు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు . ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది . సంఘటనా స్థలానికి నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేరుకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించారు . అనంతరం మృతదేహాలను నలగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు . ఎస్ఇ రాజు కేసు దర్యాప్తు చేసున్నారు . 

Related Articles

Back to top button