Trending

రాష్ట్రంలో మరో 55 కొత్త కరోనా కేసులు, Ts COVID19 cases tally

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కొత్తగా మరో 55 మందికి సోకిన మహమ్మారి , Ts COVID19 cases tally 1509 రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది . నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది . కొత్తగా మరో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వైద్య , ఆరోగ్యశాఖ తెలిపింది .

 శనివారం నమోదైన 55 పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధి లోనే 44 ఉన్నాయి . మిగతావిసంగారెడ్డిలో 2 , రంగారెడ్డిలో 1 నమోదుకాగా 8 మంది వలస కార్మికులకు కరోనా సోకింది . రాష్ట్రంలో ఇప్పటిదాకా 1509 మంది కరోనా బారినపడినట్లు వైద్య , ఆరోగ్యశాఖ తెలిపింది . కాగా వైరస్ సోకి చికిత్స పొంది కోలుకున్న 12 మంది శనివారం డిశ్చార్జి అయ్యారు . వీరితో కలుపుకుని ఇప్పటిదాకా 971 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారు .

Ts COVID19 cases tally 1509 ::

 ఇప్పటివరకు 52 మంది వలస కార్మి కులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు వైద్య , ఆరోగ్య శాఖవర్గాలు తెలిపాయి . ఒకే అపార్ట్మెంట్ లో 23 మందికి … హైదరాబాద్ మహానగరంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది . ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 23 మందికి కోవిడ్ -19 సోకిన ఘటన నగరంలోని మాదన్నపేటలో వెలుగు చూసింది . మాదన్నపేటలోని ఆ ఆపార్ట్మెంట్ లో మొత్తం 50 మందికి పరీక్షలు నిర్వహించగా 28 మందికి పాజిటివ్ అని తేలింది . దీంతో అధికారులు వారందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు . పాజిటివ్ కేసుల్లో 11 నెలల పసికందుతోపాటు ఓ గర్భిణీ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది .

 కుటుంబాల్లో పాగా వేసిన కరోనా మహమ్మారి హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 168 కుటుంబాల్లో కరోనా మహమ్మారి పాగా వేసింది . ముందుగా కుటుంబంలో ఒకరికి సోకిన వైరస్ వారి ద్వారా కుటుంబసభ్యులందరికీ సంక్రమించిందని వైద్య , ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి . కరోనా సోకిన కుటుంబాల లెక్కల జాబితాను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది . ఆ జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది . ఇక్కడ ఏకంగా 168 కుటుంబాలకు కరోనా సోకింది . హైదరాబాద్ తర్వాత 2 వ స్థానంలో రంగారెడ్డి , శివస్థానంలో మేడ్చల్ , 4 వ స్థానంలో నిజామాబాద్ , 5 వ స్థానంలో వరంగల్ అర్బన్ ఉంది . 

 కరోనా వ్యాప్తి నివారణకు తీసు కుంటున్న చర్యలు కొనసాగిస్తూనే , వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . కరోనా వ్యాప్తి నివారణ చర్యలు , లాక్డౌన్ అమలు , సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు . మంత్రులు ఈటల రాజేందర్ , కెటి రామారావు , ఎర్రబెల్లి దయాకర్ రావు , వేముల ప్రశాంత్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి , మున్సి పల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ , ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ , వంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నందీప్ సుల్తానియా , కమిషనర్ రమునందన్ రావు , పోలీస్ కమిషనర్లు అంజనీకుమా ్ , సజ్జనార్ , మహేశ్ భగవత్ , సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button