తెలంగాణలో కరోనా కల్లోలం, COVID cases in Telangana
తెలంగాణలో ఒక్కరోజే మరో 219 మందికి కరోనా COVID cases in Telangana 5,193 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య కరోనాకు మరో ఇద్దరు బలి, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 189 మందికి సోకిన మహమ్మారి .. ఇప్పటికీ 2,240 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స.
రాష్ట్రంలో కరోనా కేసులు 5 వేల మార్కును దాటాయి . వరుసగా మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ సెంచరీకి తగ్గడం లేదు . తాజాగా సోమవారం 219 పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది . కొత్తగా నమోదైన 219 కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు 5,198 మంది కరోనా బారిన పడ్డారు . వీరిలో 449 మంది విదేశాలు , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కాగా , 4,744 మంది తెలంగాణ స్థానికులు కరోనా మహమ్మారి బారిన పడడం గమనార్హం .
COVID cases in Telangana ::
కరోనా సోకి సోమవారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది . దీంతో ఇప్పటి వరకు 187 మంది కరోనాతో మృతి చెంది . ఇప్పటి వరకు 2,766 మంది కరోనా సోకిన పేషంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . ఇప్పటికీ కరోనా సోకిన 2,240 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ప్రతిరోజు మాదిరిగానే జీహెచ్ఎంసీ అగ్రభాగాన నిలిచింది . సోమవారం ఒక్కరోజే 189 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 13 కేసులు , వరంగల్ అర్బన్లో 4 , వరంగల్ రూరల్ లో 3 , మేడ్చల్ , సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున , మహబూబ్ నగర్ , మెదక్ , ఆదిలాబాద్ , యాదాద్రి , వనపర్తి , పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి .