Trending

తెలంగాణ 10th పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, Telangana SSC exam time table

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా , కోవిడ్ -19 నిబంధనలకు లోబడి Telangana SSC exam time table జూన్ 8 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి . సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు .

 ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్ 8 వ తేదీ నుండి జూలై 5 వ తేదీ వరకు నిర్వహించబోతున్నామని తెలిపారు . కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము ఆదేశాలతో గతంలో వాయిదా వేయడం జరిగిందని , ప్రస్తుత పరిస్థితులలో పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు .

 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉన్నత న్యాయస్థానము సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు . ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోబోతున్నామని వెల్లడించారు . గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ , గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రానికి అర కిలోమీటర్ లోపలే నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు . పరీక్షా కేంద్రాల మార్పును వారి సంబంధిత ప్రధానోపాధ్యాయులు , చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని మంత్రి వివరించారు .

Telangana SSC exam time table ::

 పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని , థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని మంత్రి తెలిపారు . ప్రతి బెంచిపై ఒకరు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు . పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందే అనుమతిస్తున్నామని , విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు . కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు . పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా అవసరమైన ప్రత్యేక బస్సులను ఆర్టిసి నడుపుతుందని మంత్రి తెలిపారు .

 ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సలహాలు , సూచనలు కావాలనుకొనే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు . పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు , జలుబు , జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయించనున్నట్లు వివరించారు . ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు , జలుబు , జ్వరం ఉన్నట్లయితే వారిని విధుల నుండి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు . పరీక్షా కేంద్రాల్లో విధులను నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో చేతులకు గ్లోజ్ లను కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు . పరీక్షా తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని , ఎలాంటి ఆందోళన చెందవద్దని , ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరీక్షలను నిర్వహిస్తుందని భరోసా ఇచ్చారు .

Related Articles

Back to top button