వ్యవసాయ బావిలో 9 మృతదేహాలు లభ్యం, Dead bodies in a well

తెలంగాణా రాష్ట్రంలో గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలో ( Dead bodies in a well ) దారుణం జరిగింది . కోల్కతాకు చెందిన వలన కార్మికుల కుటుంబం ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది . గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ బారదాన్ గోడౌన్లో గల బావిలో పండి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మృతి చెందారు ..

 ఈ బావిలో నుంచి గురువారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు . ఆ తరువాత ఈ రోజు ఉదయం ఒకటి తర్వాత ఒకటి మొత్తం మూడు మృతదేహాలు బావిలో తేలాయి . ఈ మృతులంతా బెంగాల్ కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు . మృత దేహాలను బావిలో నుంచి వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు . ఇంకో మృతదేహం కూడా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు బావిలోని నీరు తోడుతున్నారు .

 కొంతకాలంగా వలస కార్మికులకు జీవనోపాధికి ఇబ్బందిగా మారడం స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితులు రావడం వంటి కారణాలతో వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? లేదా ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు . Dead bodies in a well ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిలో ఇప్పటికి ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ తెలియలేదు . 

ఇక వీరితో పాటు అక్కడే నివాసం ఉన్న మరో ఇద్దరు బీహార్ యువకులు కనిపించకపోవటంతో ఇది హత్యేమో అన్న అనుమానాలు మొదలైయ్యాయి . అయితే మక్సూద్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని వారి కుటుంబం మొత్తం కలిసి రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తోందని ట్రేడర్స్ యజమాని తెలిపాడు .  ఇదే సమయంలో వలస కార్మికుల మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది . కొద్ది రోజుల క్రితం మక్సూద్ మనవడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా ఆ సందర్భంలో భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న బుస్రా విషయంలో మక్సూద్ కుటుంబానికి బీహార్ యువకులకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది . ఇక ఈ క్రమంలో ఈ కుటుంబము ఏమైనా విషప్రయోగం జరిగిందని అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Related Articles

Back to top button