Trending

భారత్ లో లక్షకు చేరువలో కరోనా కేసులు, COVID19 cases in India

భారత్ లో కరోనా రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది . COVID19 cases in India ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 96,169 మంది ఈ వైరస్ బారిన పడ్డారు . 3,029 మంది మృత్యువాత పడ్డారు . యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 56,316 , కోలుకున్న వారి సంఖ్య 36,823 గా ఉంది . గత 24 గంటల్లో 5,242 కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం . గత 24 గంటల్లో 157 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది .

 దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది . రోజు రోజుకో కొత్త రికార్డు తరహాలో అత్యధిక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం .. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి . తాజాగా నమోదైన కేసులతో లక్షకు చేరువైంది .

COVID19 cases in India ::

 రాష్ట్రా లు విడుదల చేస్తున్న బులెటిన్ ప్రకారం … దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 96 , 566 , మృతుల సంఖ్య 2,971 , డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,048 గా ఉంది . అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది . రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,058 కేసులు నమోద వగా , 1198 మంది మరణించారు .

గుజరాత్ లో 11,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదగా , 659 మంది మృతి చెందా రు . తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224 కి చేరింది . రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 మంది మరణించారు . దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ గా , ఇప్పటివరకు 160 మంది మృతిచెందారు. రికవరీ రేటు 38.29 శాతానికి పెరిగినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది . అయితే క రోనా ఇన్ఫెక్షన్ సోకిన టాప్ -10 దేశాల్లో ఇండియా కూడా చేరింది .

Related Articles

Back to top button